విశాల్ ‘చక్ర’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

గత నాలుగైదు రోజుల నుండి వరసగా తెలుగు సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెల్సిందే. దాదాపుగా 20 సినిమాలు తమ రిలీజ్ డేట్లను విడుదల చేసాయి. ఈ క్రమంలో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా చక్రకు సంబంధించిన ప్రకటన వచ్చింది. చక్రను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నారు. చక్ర చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఎమ్మెస్ ఆనందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించాడు. చక్రను మొదట ఓటిటి ప్లాట్ ఫామ్ పై విడుదల చేయాలనుకున్నారు. కానీ థియేటర్లలో ఆశాజనక పరిస్థితులు తిరిగి నెలకొంటుండడంతో ఆలోచన మార్చుకుని థియేటర్ రిలీజ్ వైపు మొగ్గు చూపారు. 19న తెలుగులో నితిన్ నటించిన చెక్ తో చక్ర పోటీ పడబోతోంది.