విష్ణుప్రియ భీమినేని ఒక చిన్న సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ పై పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇవేం బ్రేక్ ఇవ్వకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా మారింది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అనసూయ, రష్మీ, శ్రీముఖి తర్వాత గ్లామరస్ యాంకర్ గా స్థిరపడాలనుకుంటోంది. ఇప్పటికే పలు షోస్ తో గుర్తింపు తెచ్చుకుంది.
ఈ యాంకర్ అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ కు కూడా ఎస్ చెబుతుంది. ఇదిలా ఉంటె ఈ అమ్మడు ఇటీవలే చెక్ మేట్ అనే చిన్న సినిమాలో నటించింది. ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య ఓటిటిలో విడుదలయ్యే చిన్న సినిమాల ప్రధాన టార్గెట్ ఏంటో తెలిసిందేగా. హాట్ సీన్లు, ముద్దు సన్నివేశాలతో పబ్లిసిటీ తెచ్చుకోవడం. విష్ణుప్రియ నటించిన చెక్ మేట్ కూడా ఇదే కోవకు చెందుతుంది.
ఈ వెబ్ సినిమాలో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించానని విష్ణుప్రియ స్వయంగా చెబుతోంది. కథ, తన పాత్ర డిమాండ్ మేరకే ఇలా నటించానని అంటోంది. అటు యాంకరింగ్ ను, ఇటు యాక్టింగ్ ను సమాంతరంగా టాప్ గేర్ లో నడిపించాలని విష్ణుప్రియ కోరుకుంటోంది.