బిబి5 : విష్ణు ప్రియా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ నిజమా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో అయిదవ వారంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ వైల్డ్‌ కార్డ్ ఎంట్రీతో యాంకర్‌ విష్ణు ప్రియా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్‌ బాస్ సీజన్ 5 లో ఇప్పటికే అందగత్తెలు ఉన్నారు. ఇప్పుడు విష్ణు ప్రియా ఎంట్రీతో హౌస్ మరింత హాట్ గా తయారు అవుతుంది అనేది టాక్. సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చల నేపథ్యంలో అసలు ఏం జరుగబోతుంది అనే ఆసక్తి నెలకొంది.

గతంలో కూడా విష్ణు ప్రియా బిగ్ బాస్‌ హౌస్‌ లోకి వెళ్లబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని ఆమె గతంలో మాట్లాడుతూ తనకు బిగ్‌ బాస్ కాన్సెప్ట్‌ పెద్దగా నచ్చదు. నేను అక్కడకు వెళ్లాలి అనుకోవడం లేదు. చాలా సార్లు నాకు బిగ్ బాస్ ఆఫర్‌ వచ్చినా కూడా నేను వద్దు అనుకున్నారు అంది. బిగ్‌ బాస్ కాన్సెప్ట్‌ అంటే నచ్చదు అంటూ వ్యాఖ్యలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఎలా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో అన్ని విషయాలపై మరింత స్పష్టత వస్తుంది.