జక్కన్న కర్ణాటక ట్రిప్‌ కారణం ఏంటో?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సతీ సమేతంగా కర్ణాటక వెళ్లారు. గత రెండు రోజులుగా అక్కడ పలు ప్రాంతాల్లో రాజమౌళి మరియు రమా రాజమౌళి పర్యటిస్తున్నారు. కొన్ని దేవాలయాలకు వెళ్లడంతో పాటు అటవి ప్రాంతంలో కూడా జక్కన్న పర్యటించారు. ఉన్నట్లుండి ఈ సమయంలో రాజమౌళి కర్ణాటక పర్యటన విషయంలో సినీ వర్గాల్లో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ కోసం లొకేషన్స్‌ ను వెదికేందుకు రాజమౌళి వెళ్లి ఉంటాడా అనేది ఒక చర్చ జరుగుతోంది. వచ్చే నెల లేదా నవంబర్‌ నుండి షూటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి రాజమౌళి ఈ ట్రిప్‌ వేశాడా అనేది తెలియాల్సి ఉంది.

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ మూడు వంతుల శాతం పూర్తి అయ్యింది. కరోనా వచ్చి ఉండకుంటే షూటింగ్‌ పూర్తి అయ్యి నిర్మాణానంతర పనులు జరిగేవి. షూటింగ్‌ నిమిత్తం మరో మూడు నెలలు కేటాయించాల్సి ఉంది. వచ్చ ఏడాది వరకు షూటింగ్‌ ను పూర్తి చేసి సినిమాను వచ్చ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో నటించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఆలియా భట్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటించబోతున్నాడు. శ్రియ కూడా ముఖ్యమైన గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు విపరీతమైన క్రేజ్‌ ఉంది.