ఈడీ నుండి సమన్లు అందుకున్న యామీ గౌతమ్

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సమన్లు జారీ చేసింది. ఆమె తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందు జులై 7వ తారీఖున హాజరు కావాలని సామాన్లలో తెలిపింది.

ఫారిన్ ఎక్స్చేంజ్ మానేజ్మెంట్ యాక్ట్ ప్రకారం యామీ గౌతమ్ కు సమన్లు పంపుతున్నట్లు ఈ కేసుకు సంబంధించిన అధికారి ఒకరు తెలియజేసారు. “ఏజెన్సీ జులై 7న యామీ గౌతమ్ ను తమ ముందు హాజరై తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాల్సి ఉంటుంది” అని ఆ అధికారి మీడియాకు తెలియజేసారు.

యామీ గౌతమ్ బ్యాంక్ అకౌంట్ కు విదేశీ ఖాతాల నుండి సుమారు కోటిన్నర రూపాయలు జమ అయ్యాయని, దీనికి సంబంధించిన వివరాల కోసం ఆమెకు సమన్లు పంపామని తెలిపారు. రీసెంట్ గా యామీ గౌతమ్ యూరీ దర్శకుడు ఆదిత్య ధార్ ను వివాహమాడిన విషయం తెల్సిందే.