‘మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఇదే సాక్ష్యం..’ ఉద్యోగులకు చెప్పండి: సీఎం జగన్

ప్రభుత్వోద్యోగులనూ, పీఆర్సీని ఉద్దేశించి క్యాబినెట్ భేటీలో మంత్రుల వద్ద సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు 15 పాయింట్లతో కూడిన సమాచారాన్ని మంత్రులకు అందజేశారు. ‘మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగుల డిమాండ్లు తీర్చాలంటే ఒక పెద్ద పథకం ఆపాలి. ప్రజలకిచ్చిన హామీ వల్ల అలా చేయలేం. మీకిచ్చిన సమాచారాన్నే ఎమ్మెల్యేలకూ ఇస్తాం. ఊళ్లలో ఉద్యోగాలతో మాట్లాడండి. ఎటువంటి ఇబ్బందీ లేకపోతే ఉద్యోగులకు ఎందుకు చేయము’.

‘అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.28 లక్షల శాస్వత ఉద్యోగాలిచ్చాం. ఇప్పుడు పదవీ విరమణ వయసు పెంచాం. స్మార్ట్ టౌన్ షిప్స్ లో 20 శాతం రాయితీతో 10 శాతం ఇళ్లు కేటాయించాం.’

ఇవన్నీ ఫ్రెండ్లీ ప్రభుత్వంతో చేసినదే కదా. ప్రతిపక్షాల ట్రాప్ లో ఉద్యోగస్తులు పడకుండా చూడండి. చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన ఉద్యోగాలెన్ని.. మనం ఇచ్చిన ఉద్యోగాలెన్ని.. అన్నింటినీ ఉద్యోగస్తులకు వివరించండి’ అని వివరించారు.