రేపు హస్తినకు సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ

సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ కానున్నారు.

ఈ పర్యటనలో ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు, విభజన హామీలు, పోలవరం.. తదితర అంశాలపై చర్చించనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.