దేవుడితో చెలగాటం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థ ఆలయంలో ఉన్న శతాబ్దాల క్రితం రాములవారి విగ్రహంను దుండగులు ద్వంసం చేసిన ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుంది. ఈ విషయమై సీఎం జగన్‌ కూడా స్పందించారు.

విగ్రహం ద్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ పేర్కొంటూనే దేవాలయాలపై దాడులకు పాల్పడ్డ వారు దేవుడితో చెలగాటం ఆడుతున్నట్లే అని, వారికి కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరించాడు.

దేవుడితో చెలగాటం అనేది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించాడు. ఈ విషయాన్ని రాజకీయం చేసే ఉద్దేశ్యంను విపక్ష పార్టీలు మానుకోవాలంటూ ఈ సందర్బంగా వైకాపా నాయకులు మరియు మంత్రులు అంటున్నారు.

దోషులను వెంటనే పట్టుకుని శిక్షిస్తామంటూ వారు హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి సంఘటన జరుగకుండా చూసుకుంటామంటూ వైకాపా మంత్రులు హామీ ఇస్తున్నారు.