కేసీఆర్‌ ఇలాకాలో షర్మిల యాత్ర

రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వైఎస్ షర్మిల గజ్వెల్‌ లో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. సీఎం కేసీఆర్‌ నియోజక వర్గం అయిన గజ్వేల్‌ లో షర్మిల పర్యటించేందుకు సిద్దం అయ్యింది. ఉదయం అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించి నేరుగా గజ్వేల్‌ కు వెళ్లి అక్కడ నిరుద్యోగులతో చర్చించేందుకు సిద్దం అయ్యింది. పెద్ద ఎత్తున షర్మిల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు పావులు కదుపుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఆమెపై నమ్మకం కలిగిస్తాయి.

నిరుద్యోగుల కోసం ఉద్యమం చేస్తానంటూ ప్రకటించిన షర్మిల ఈసారి ఏకంగా కేసీఆర్‌ సొంత నియోజక వర్గంలో ఆందోళన చేసేందుకు సిద్దం అవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు అంటున్నారు. అక్కడ ఉద్యమం చేస్తేనే మీడియాలో బాగా ఎలివేట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ ఆందోళన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌ నియోజక వర్గంలోనే ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. అందుకే అక్కడ నుండి ఉద్యమం ప్రారంభించాలనే నిర్ణయానికి షర్మిల వచ్చిందట.