తెలంగాణలో వైఎస్ షర్మిల మొదలు పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడుకు చెందిన ప్రియదర్శిణి పని చేస్తున్న విషయం తెల్సిందే. అందరికి తెల్సిన విషయం ఏంటీ అంటే ఆమె ప్రశాంత్ కిషోర్ టీమ్ మెంబర్. మీడియా వ్యవహారాలు చూసుకుంటూ గతంలో పలు ప్రాజెక్ట్ ల్లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి చురుకుగా పని చేశారు. అలాంటి ప్రియదర్శిణి ఇప్పుడు షర్మిల కోసం వర్క్ చేస్తున్నారు.
షర్మిల పార్టీ కి ఆమె వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నా వెనుక ఉండి నడిపిస్తున్నది పూర్తిగా ప్రశాంత్ కిషోర్ అంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన పూర్తిగా వైఎస్సార్‌టీవీపీ కి మద్దతుగా బహిరంగంగా రాలేక పోతున్నారు. కనుక ఆయన స్వయంగా ప్రియదర్శిణి ద్వారా షర్మిలకు ఇన్ పుట్స్ ఇస్తున్నారని సమాచారం అందుతోంది. ఆయన ఏవిధంగా నడిపిస్తే షర్మిల ఆ విధంగా నడుస్తుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి షర్మిల ప్రతి మాట వెనుక కూడా పీకే ఉన్నాడని అంటున్నారు.