నిరుద్యోగ నిరాహార దీక్షకు మా ఇంటికి రావద్దు

తెలంగాణలో కొత్తగా పుట్టిన షర్మిల పార్టీ వైఎస్సార్‌టీపీకి ఆదిలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక వైపు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో మరో వైపు షర్మిల పార్టీపై జనాల్లో కూడా ఆసక్తి కనిపించడం లేదు. షర్మిల ప్రధానంగా నిరుద్యోగం సమస్యను అజెండాగా ఎత్తుకుంది. ఆ కారణంగానే ఆమె ప్రతి వారం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఇంటి వద్ద దీక్ష కు సిద్దం అవుతున్నారు. ఈ వారం మంచిర్యాల జిల్లా దండేపల్లి లింగాపూర్‌ కు చెందిన ఆత్మహత్య చేసుకున్న నరేష్ ఇంట దీక్ష చేయాలనుకుంది.

నరేష్‌ కుటుంబ సభ్యులు తమ ఇంట దీక్షకు రావద్దు అంటూ షర్మిలకు తెలియజేశారు. నరేష్‌ కు ముగ్గురు అన్నలు. వారు ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగంను సంపాదించుకున్నారు. మంచి స్థాయిలోనే ఉన్నారు. కాని డిగ్రీ చదివిన నరేష్ మాత్రం ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు షర్మిల తమ ఇంటి వద్ద దీక్ష చేస్తే తమ ముగ్గురు కొడుకుల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో నరేష్ తండ్రి షర్మిల దీక్షకు అనుమతి నిరాకరించాడు.