2010లో వీర్ సినిమాతో జరీన్ ఖాన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు సల్మాన్ ఖాన్. ఆ తర్వాత రెడీ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. అప్పటినుండి ఈ భామ అడపాదడపా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కొనసాగుతోంది. హౌజ్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, వీరప్పన్, 1921, చాణక్య వంటి సినిమాల్లో నటించింది జరీన్ ఖాన్.
తన కెరీర్ లో ఎక్కువ గ్లామరస్ రోల్స్ వేసిన జరీన్ డీగ్లామ్ రోల్స్ లో నన్ను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరని చెబుతోంది. అలాగే జరీన్ ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తోంది. తన నెక్స్ట్ సినిమాలో లెస్బియన్ గా కనిపించనుంది జరీన్. ఈ పాత్ర తనకు చాలా ఛాలెంజింగ్ అని చెప్పింది. ఎందుకంటే తన జీవితంలో ఎక్కువగా మగరాయుడిలానే కనిపించానని, ఈ పాత్ర కోసం ఆడ లక్షణాలను అలవర్చుకుంటున్నాని తెలిపింది.
లెస్బియన్ గా నటించడం చాలా కష్టమని అయితే నిజాయితిగా, సహజంగా నటించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.