Home Blog Page 4

మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో ప్రియాంక చోప్రా?

0

మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ప్రియాంక చోప్రా గాయ‌కుడు, న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికాలో సెటిలయ్యాక కేవ‌లం హాలీవుడ్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తోంది. సిటాడెల్ సీజ‌న్- 1 లో న‌టించిన పీసీ ఇప్పుడు సీజ‌న్ 2లో కూడా న‌టిస్తోంది. అయితే ప్రియాంక చోప్రా హిందీ చిత్ర‌సీమ‌కు తిరిగి వ‌చ్చేదెప్పుడు? అంటూ అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు.

ఇంత‌కుముందు ఫ‌ర్హాన్ అక్త‌ర్ దర్శ‌క‌త్వంలో ‘జీలే జ‌రా’ చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేసింది. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇందులో ఆలియా, క‌త్రిన లాంటి స్టార్లు కూడా నటించాల్సి ఉంది. కానీ మ‌ధ్య‌లోనే ఈ సినిమా ఆగిపోయింది. తాజా స‌మాచారం మేర‌కు ప్రియాంక చోప్రా ఒక సౌత్ సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు- రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఆ మేర‌కు ఫిలింఫేర్ త‌న క‌థ‌నంలో ఈ వివ‌రాల్ని వెల్ల‌డించింది. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే మ‌హేష్ త‌న మేకోవ‌ర్ తో సిద్ధంగా ఉన్నాడు. రాజ‌మౌళి ఈ చిత్రాన్ని ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ కేట‌గిరీలో అత్యంత భారీగా తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. ప్రియాంక చోప్రా చివ‌రిగా స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో న‌టించింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌హేష్ – రాజ‌మౌళి లాంటి క్రేజీ కాంబినేష‌న్ లో అవ‌కాశం అందుకోవ‌డం జాక్ పాట్ అనే చెప్పాలి. మ‌హేష్ మూవీలో పీసీ అయితే మేక‌ర్స్ అధికారికంగా దీనిని ధృవీక‌రించాల్సి ఉంది.

Miss You Movie Review

0

Miss You is a 2024 Tamil language romantic comedy film written and directed by N.Rajasekar. The film is dubbed into Telugu and has the same title. It has Siddharth & Ashika Ranganath playing the lead roles while Karunakaran, Balasaravanan, Maaran, Sastika Rajendran, Sarath Lohithaswa, Jeyaprakash, Anupama, Ponvannan, Naren, & others are seen in important supporting roles. The music is composed by Ghibran while the film is produced by Samuel Mathew under 7 Miles Per Second banner.

Story:

Vasu (Siddharth) is an aspiring film director. But after a fatal accident, he loses memory of the final two years of his life. After getting back on his feet, he befriends Bobby (Karunakaran) at the train station and comes to Bangalore. There he encounters a strong and opinionated Subbalakshmi (Ashika Ranganath) and falls in love with her. Vasu immediately tells her his feelings but he is turned down. Later he gets to know that he had a past with Subbalakshmi before his accident. What is his past? How will he win her love? It needs to be seen in the film.

What about on-screen performances?

Siddharth exudes charm and delivers a composed performance. He fits aptly into the shoes of an aspiring filmmaker named Vasu and these kinds of roles are a cakewalk for him.

Ashika Ranganath impresses with her screen presence and carries her role with grace and adequate expressions. She gets to do two contrasting shades in the film and she passes with flying colours.

Karunakaran is good in parts as the friend who crosses parts with the hero at the railway station.

Lollu Sabha star Maaran is fine with his one-liners at a few places but the rest of the friend’s gang including Balasaravanan & Sastika Rajendran are just about fine.

Sharath Lohithaswa is wasted in the typical role of an influential politician who issues constant threats to the hero. Jeyaprakash, Anupama, Ponvannan, Naren, & others are okay in their limited portions.

What about off-screen talents?

The story by N.Rajasekar lacks novelty and is not so interesting. The movie follows a formulaic plot which we have seen in a few films in the past like the recent Nani starrer ‘Hi Nanna’ where the lead character loses memory and gets to meet the same person in the past again. The screenplay by N.Rajasekar & R.Ashok is lethargic and is filled with cliched scenes.

The way the hero befriends a stranger in a railway station and the whole track with the friends’ gang are good examples of this. The biggest minus of the film is the lack of a strong conflict point. The tussle between the two lead characters is not properly portrayed and told through the scenes.

We are told that the lead character’s ambition is to become a filmmaker, but this aspect is hardly explored in the movie. Adding to this, the film has a number of badly choreographed songs that detract from the overall atmosphere. If one or two of these songs—which don’t further the plot—had been cut, the movie may have been better.

Also, the fight scenes do not offer an adrenaline rush and come across as a forced addition to satisfy the commercial requirements. Director N.Rajasekar does a below-par job with his craft as his presentation and narrative style look completely outdated.

He could not maintain a basic emotional connect with the characters through his narration and with the writing. More focus on the screenplay, character designs and emotions could’ve made this a decent rom-com.

The Telugu dialogues are fine and the Telugu dubbing is done well for the lead roles but it is pretty underwhelming for the other supporting artists.

The songs by Ghibran in Telugu especially are too bad. The tunes and the lyrics never worked well as the dubbing work was not up to the mark.

His background score is good in parts. The camera work by K.G.Venkatesh is neat while the edit by Dinesh Ponraj is very ordinary. The production values of 7 Miles Per Second are adequate.

The production values of 7 Miles Per Second are adequate.

What’s Hot?
* Siddharth’s Performance
* Ashika Ranganath’s Performance
* Bus Scene & After Marriage Portions
* Cinematography & Production Values

What’s Not?
* Uninteresting Plot & Dull Screenplay
* Outdated Presentation & Weak Conflict Points
* Terrible Songs In Telugu
* Poor Dance Choreography
* Weak Emotional Connect Between Lead Pair
* Too Many Cliched & Filler Scenes
* Unnecesary & Routine Fight Scenes
* Hero Friend’s Characterizations

Verdict:

On the whole, Miss You is an outdated romantic comedy that never has the freshness that was needed for this genre. Apart from a few light-hearted scenes here & there, the film fails to keep us entertained in the theatres and the lack of basic promotion makes it even worse for people to go to the cinema halls.

రాబిన్ హుడ్.. మైత్రీ సంక్రాంతి స్కెచ్ మామూలుగా లేదు!

0

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరైన హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తన అప్ కమింగ్ మూవీ రాబిన్ హుడ్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎలా అయినా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. రాబిన్ హుడ్ కూడా అలరిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.

యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న వేళ.. ఒక్కసారిగా ప్రమోషన్స్ ఆగిపోయాయి. సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఓవైపు సినిమా వర్క్ పెండింగ్ ఉంది!.. మరోవైపు పుష్ప-2 దూసుకుపోతోంది.. దీంతో క్రిస్మస్ కు రిలీజ్ చేస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందనే కారణంతో పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ మాత్రం.. క్రిస్మస్ కే సందడి చేయాలని పట్టుబట్టినా.. వాయిదా వేయడం తప్పలేదని సమాచారం. అయితే పోస్ట్ పోన్ సరే.. మరి రాబిన్ హుడ్ రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి కానుకగా రాబిన్ హుడ్ ను రిలీజ్ చేయనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే సంక్రాంతికి ఇప్పటికే మూడు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

అయితే రాబిన్ హుడ్ కాకుండా మిగతా మూడు చిత్రాల్లో రెండు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నవే. మరొకటి నాగవంశీ రూపొందిస్తున్నారు. ఇప్పుడు తానేం తక్కువ అన్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ కూడా రాబిన్ హుడ్ తో సంక్రాంతికి వచ్చేస్తుందన్నమాట. అయితే నిజానికి మైత్రీ సంస్థ..

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో పొంగల్ కు సందడి చేద్దామనుకుని ఇప్పటికే ఫిక్స్ అయింది. కానీ ఆ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోందట. థియేటర్ల విషయంలో కాస్త పోటీ ఉన్నా.. ఇప్పటికే అజిత్ మూవీ కోసం మైత్రీ సంస్థ లాక్ చేసి ఉంచిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అవి రాబిన్ హుడ్ కు దక్కుతాయని సమాచారం. పుష్ప-2 కూడా తమదే కాబట్టి..

ఆ మూవీ ఎగ్జిబిటర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి రాబిన్ హుడ్ మూవీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడూ దిల్ రాజు వర్సెస్ మైత్రీ అనేలా పోటీ ఉంటుండగా.. ఇప్పుడు సంక్రాంతికి కూడా అదే పరిస్థితి కనిపించనుంది. అదే సమయంలో రాబిన్ హుడ్ కంటెంట్ పై కూడా మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మరి ఆ మూవీ పొంగల్ కు వచ్చి ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

నాగార్జున ప‌రువు న‌ష్టం దావా స్కిప్ కొట్టిన సురేఖ‌!

0

అక్కినేని కుటుబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మ‌య్యాయో తెలిసిందే. దీంతో నాగార్జున ఆమెపై ప‌రువు న‌ష్టం దావా కేసు కూడా వేసారు. ప్ర‌తిగా సురేఖ దిగొచ్చి స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసారు. ఈ పిటీష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన నాంప‌ల్లి కోర్టు సురేఖ‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈనెల 12న సురేఖ వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. అయితే నిన్న జ‌రిగిన విచార‌ణ‌కు మాత్రం సురేఖ హాజ‌ర‌వ్వలేదు.

ప‌లు కార్య‌క్ర‌మాల కార‌ణంగా వ్య‌క్తిగ‌త విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని ఆమె త‌రుపు న్యాయ‌వాది కోర్టుకు వెల్ల‌డించారు. ఈనేప‌థ్యంలో మ‌రింత గ‌డువు కావాల‌ని కోర్టును కోరారు. దీంతో న్యాయ‌స్థానం ఈనెల 19కి విచార‌ణ వాయిదా వేసింది. సురేఖ విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోవ‌డంపై అక్కినేని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

సురేఖ మాట్లాడిన ప్ర‌తీ మాట‌కు కోర్టులో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాల‌తో ఆమె అలా మాట్లాడింద‌ని మండిప‌డుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో సురేఖ అక్కినేని ఫ్యామిలీ-స‌మంత‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేసారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నాగార్జున వెంట‌నే ప‌రువు న‌ష్టం దావా వేసారు. అలాగే ఇండ‌స్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కినేని ఫ్యామిలీకి మ‌ద్ద‌తు ల‌భించింది.

సురేఖ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ప‌రిగ‌ణించి ఆమపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. త‌క్ష‌ణ‌మే అక్కినేని ఫ్యామిలీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసారు. ప్ర‌తిగా ఆమె స‌మంత కు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసారు. సురేఖ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసాయి. సినిమా-రాజ‌కీయం రెండు వేర్వేరు రంగాలైనా రెండింటిని ముడిపెట్టి ఆమె మాట్లాడిన తీరుపై అభ్య‌త‌రం వ్య‌క్త‌మైంది.

జానీ మాస్ట‌ర్ కంబ్యాక్ గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా?

0

అత్యాచారం ఆరోపణ కేసులో కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అరెస్ట్ ఆ మధ్య ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఈ కేసు ప‌డ‌టంతో చేతి వ‌ర‌కూ వ‌చ్చిన జాతీయ అవార్డు సైతం రాకుండా పోయింది. అందుకోవ‌డానికి అన‌ర్హుడంటూ అవార్డు చేజారింది. కోర్టు అవార్డు కోసం మ‌ధ్యంతర బెయిల్ ఇచ్చినా క‌మిటీ తిర‌స్క‌రించ‌డంతో జానీ ఎంతో నిరుత్సాహ‌నికి గుర‌య్యాడు. వ‌చ్చిన బెయిల్ సైతం ర‌ద్దు చేయించుకున్నాడు.

ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో జానీ మ‌ళ్లీ వృత్తి ప‌రంగా బిజీ అయ్యే ప‌నిలో ప‌డ్డాడు. మ‌ళ్లీ ప్రాక్టీస్ షురూ చేసాడు. `బ్యాక్ టూ ది బీట్స్ ఇన్ పుల్ వాల్యూమ్` అని ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు. త్వ‌ర‌లోనే బిగ్ అప్ డేట్స్ వ‌స్తాయ‌ని తెలిపాడు. దీంతో జానీ తిరిగి మ‌ళ్లీ త‌న డాన్స్ స్టూడియోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. జానీ ఈజ్ బ్యాక్ అనిపించేలా స‌మ‌యత్తం అవుతున్నాడు.

త‌న డాన్స్ టీమ్ తో క‌లిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో జానీ మాస్ట‌ర్ కూడా ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఎదిగిన కొరియోగ్రాఫ‌ర్. అత‌డిలో ఫ్యాష‌న్ గురించి స్టార్ హీరోలు ప్రోత్స‌హించ‌డంతోనే పెద్ద కొరియోగ్రాఫ‌ర్ గా ఎదిగాడు. అయితే అత్యాచారం చేసాడ‌ని త‌న వ‌ద్ద శిష్య‌రికం చేసిన అమ్మాయే కేసు పెట్ట‌డంతో అది నెగిటివ్ గా మారింది. దీంతో `పుష్ప‌2` సినిమా నుంచి జానీని మేక‌ర్స్ తొల‌గించారు.

మ‌రి ఇప్పుడు కొత్త‌గా బిగ్ అప్ డేట్స్ ఇస్తానంటూ జానీ ప్రామిస్ చేసిన నేప‌థ్యంలో తాను చేయ‌బోయే సినిమాలు ఎలా ఉంటాయి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జానీ మాస్టార్ ఇప్ప‌టికే టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రికీ డాన్స్ కొరియోగ్ర‌ఫీ చేసాడు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోల‌కు సైతం డాన్సు మాస్ట‌ర్ గా ప‌నిచేసాడు. అక్క‌డా మంచి పేరు తెచ్చుకున్నాడు. మ‌రి కంబ్యాక్ లో ఎలాంటి సినిమాలకు ప‌నిచేస్తాడో చూడాలి.

ధనుష్ తో వివాదం.. తొలిసారిగా నోరు విప్పిన నయన్!

0

ఇటీవల ధనుష్ – నయనతార మధ్య నెలకొన్న వివాదం కొన్ని రోజులపాటు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా నడిచింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ’ నెట్‌ఫ్లిక్స్ ఇండియా డాక్యుమెంటరీ విడుదల నేపథ్యంలో, ధనుష్ ను విమర్శిస్తూ నయన్ రాసిన ఓపెన్ లెటర్ పెద్ద దుమారం రేపింది. ఇది తన డాక్యుమెంటరీకి ప్రచారం చేసుకోడానికి వాడిన పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ధనుష్ తో వివాదంపై ఎట్టకేలకు తొలిసారి నయనతార నోరు విప్పింది. తాను పబ్లిసిటీ కోసం ఎదుటివారి ఇమేజ్ ను దిగజార్చాలని అనుకునే వ్యక్తిని కాదని చెప్పింది.

‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ’లో ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీ క్లిప్స్ ను వాడుకోడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదని, పైగా 3 సెకండ్ల బీటీఎస్ విజువల్స్ ఉపయోగించినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించాడని నయన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ధనుష్ లాంటి పాపులర్ యాక్టర్ మీద ఓపెన్ లెటర్ రాయడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతారను ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ ధనుష్ తనతో డైరెక్ట్ గా మాట్లాడటానికి నిరాకరించినందున, ఈ విషయాన్ని పబ్లిక్‌గా తీసుకెళ్లడం తప్ప తనకు వేరే మార్గం లేదని తెలిపింది.

“నిజం నుండి మాత్రమే ధైర్యం వస్తుంది. నేను ఏదైనా కల్పించి చెప్పినప్పుడు మాత్రమే నేను భయపడాలి. నేను అలా చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మాట్లాడకపోతే, విషయాలు చాలా దూరం వెళ్లిన తర్వాత, మళ్లీ తమ కోసం నిలబడే ధైర్యం ఎవరికీ ఉంటుందని నేను అనుకోను. అసలు నేను సరైనది అని భావించే పని చేయడానికి నేను ఎందుకు భయపడాలి?. నేను ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. నేను కేవలం పబ్లిసిటీ కోసమే ఒకరి ప్రతిష్టను దిగజార్చాలనుకునే వ్యక్తిని కాదు” అని నయనతార అన్నారు.

“ధనుష్ మేనేజర్‌కి విఘ్నేష్ చాలా కాల్స్ చేసాడు, మేము చాలామంది కామన్ ఫ్రెండ్స్ తో మాట్లాడించాం. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు. ఆ సినిమాలో విఘ్నేష్ రాసిన నాలుగు లైన్లను మాత్రమే మేము ఉపయోగించాలనుకున్నాం. అది మాకు చాలా పర్సనల్. అందుకే డాక్యుమెంటరీలో ఆ లైన్స్ ఉండాలని కోరుకున్నాం. దాని కోసమే మేము నిజంగా చాలా ట్రై చేశాం. ఆ నాలుగు లైన్లు మా మొత్తం జీవితానికి సంబంధించినవి అని భావించాం. అతను (ధనుష్) ఫ్రెండ్ గా ఉన్నాడు కాబట్టి, దానికి ఓకే చెప్పే మొదటి వ్యక్తి అతనే అని నేను నిజంగా అనుకున్నాను. మేము శత్రువులుగా పుట్టలేదు. నిజంగా మేము ఎల్లప్పుడూ మంచి స్నేహితులుగా ఉన్నాం. కానీ గత 10 ఏళ్లలో ఎక్కడ, ఎలా మారిందో నాకు తెలియదు. నేను అందులోకి వెళ్ళాలని అనుకోవడం లేదు”

“ఎందుకంటే అతనికి అతని స్వంత కారణాలు ఉండవచ్చు, నాకు నా స్వంత కారణాలు ఉండవచ్చు. కానీ నేను అతని మేనేజర్‌తో మాట్లాడాను. నేను అంతకుముందు ఎప్పుడూ అలా చేయలేదు. ఎన్ఓసీ ఇవ్వకపోయినా పర్వాలేదు.. ధనుష్ తో ఒక్కసారి మాట్లాడాలని చెప్పా. అది అతని సినిమా.. ఏ క్లిప్‌లను ఉపయోగించాలి లేదా ఉపయోగించవద్దు అని చెప్పడానికి అతనికి అన్ని హక్కులు ఉన్నాయి. మేము సినిమాలోని ఆ 4 లైన్స్ యూస్ చెయ్యాలని అనుకున్నాం. కానీ తనకు అది ఇష్టం లేదని అర్థమైంది.

కానీ సమస్య ఏమిటో తెలుసుకోడానికి అతనితో జస్ట్ ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడాలనుకున్నాను” “మాతో ఇష్యూ ఏంటి? అసలు ప్రాబ్లమ్ ఏంటి?, మాపై ఎందుకు అంత కోపంగా ఉన్నారు?, నిజంగానే మాపై కోపంగా ఉన్నారా?, లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సృష్టించేదేనా? ఇంకా ఏదైనా మిస్ అండర్ స్టాండింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా అని నేను అతనితో మాట్లాడాలనుకున్నాను. మనం మంచి స్నేహితులం కానవసరం లేదు, కానీ మనం దానిని క్లియర్ చేయగలం. దాని వల్ల మనం ఎక్కడైనా ఒకరినొకరు ఎదురుపడినప్పుడు, ఒకరినొకరు పలకరించుకోవచ్చు. కనీసం ‘హాయ్’ చెప్పుకోవచ్చు.

ఇదే నేను కోరుకున్నది. నిజంగా నేను దీని కోసమే ప్రయత్నించాను” “డాక్యుమెంటరీ ట్రైలర్ లో మా ఫోన్ లో అప్పుడెప్పుడో తీసిన బీటీఎస్ విజువల్స్ ఉపయోగించాం. కానీ జనాలు అది అర్ధం చేసుకోలేదు. అతని సినిమాలోని ఫుటేజ్.. అన్ని రైట్స్ అతనికే ఉంటాయి అని అన్నారు. మేము అస్సలు సినిమాలోని క్లిప్పింగ్స్ గురించి అస్సలు మాట్లాడలేదు. బీటీఎస్ ఇప్పుడు ఒప్పందంలో భాగం మాత్రమే. అతను చాలా పేరున్న వ్యక్తి. ప్రజలు ఆరాధించే నటుడు. మాకు కూడా అతని పట్ల అదే గౌరవం, ప్రేమ ఉన్నాయి. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం చాలా అన్యాయం అనిపిస్తుంది” అని నయనతార చెప్పుకొచ్చింది.

అల్లు అర్జున్.. ఐ లవ్ యూ: రాజేంద్రప్రసాద్

0

అల్లు అర్జున్ నటించిన ”పుష్ప 2: ది రూల్” సినిమాపై ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘హరికథ’ వెబ్ సిరీస్ ఈవెంట్‌లో “నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో” అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. బన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ కథనాలు ప్రచారంలోకి రావడంతో, ఈ ఇష్యూపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ తన బిడ్డ లాంటోడని, అతనిపై నెగెటివ్ గా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.

రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఛీ ఛీ ఛీ.. అల్లు అర్జున్ గురించి నేను నెగిటివ్‌గా మాట్లాడతానా?? అవసరం లేదు.. నేను అలా అంటానా? నా బిడ్డండీ వాడు.. నాకు కొడుకులాంటి వాడు. అల్లు అర్జున్.. ఐ లవ్యూ. ఆ వార్తలు చూసి నాకు నవ్వు వచ్చింది. పోనీలే ఇంత కాలానికి 48 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది, మనం ఏదో నెగిటివ్‌గా మాట్లాడానని కలర్ ఇచ్చాడు. ఆ రాసిన వాడెవడో తెలిస్తే.. ‘పుష్ప-2లో హీరో దొంగ’ అని నేను అన్నట్టుగా రాసేసాడు. ఓరి పిచ్చనా పుచ్చీ.. నేను అన్న ఉద్దేశం అది కాదు” అని అన్నారు.

”నా ఉద్దేశ్యం ఏంటంటే నేను హీరోగా ఇన్నేళ్ల నుంచి ఉన్నా.. రెగ్యులర్ హీరోని కాదు నేను. ‘లేడీస్ టైలర్’ నుంచి నిన్నగాక మొన్న వచ్చిన ‘కల్కి’ ‘లగ్గం’ వరకూ ఎన్నో సూపర్ హిట్స్ చూశాను. అసలు ఆ ఫంక్షన్‌‌లో నేను మాట్లాడింది ఏంటి?.. ‘నేను హీరోనా? ‘లేడీస్ టైలర్‌’లో నేను హీరోనా? వాడో సన్నాసి. ‘అప్పుల అప్పారావు’ హీరోనా? వాడు వెధవ.. ‘ఏప్రిల్ 1 విడుదల’లో దొంగ.. అంటే ఇలాంటి సమాజంలో మన పక్కనున్న క్యారెక్టర్స్‌ని హీరోగా తీసుకుని, ఆ క్యారెక్టర్ ద్వారానే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చా”

”ఇవాళ నటుడిగా నాకున్న విశేషం ఏంటంటే.. ప్రతి ఇంట్లోనూ ఒక మంచం, ఒక కంచం ఒక గ్లాసు తప్పేలా ఎలా ఉంటుందో.. రాజేంద్ర ప్రసాద్ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఇక్కడే కాదు.. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మనసు బాగోలేనప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో నేనేదో దొంగ అని అన్నట్లు వాడెవడో రాశాడు. నేను దొంగ అంటే దొంగోడు అయిపోతాడా? పైగా ఎవరు.. అల్లు అర్జున్. నా బిడ్డ లాంటోడు. ఐ లవ్ దట్ ఫెలో. బన్నీ నన్ను పిచ్చగా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడు అంటే, షూటింగ్ దగ్గర గురువు గారు.. గురువు గారు అంటూ ఉంటాడు”

”జులాయి సినిమా ఈవెంట్ లో గురువు గారు నాకు ఎంతో నేర్పారు అంటూ ఓపెన్ గా చెప్పాడు. అల్లు అర్జున్ జర్నీ చూస్తే.. జులాయి సినిమాకి ముందు, జులాయి తరువాత అని అంటాను. కావాలంటే చెక్ చేసుకోండి తెలిసిపోతుంది. అతను నన్ను ఎంతో ప్రేమిస్తాడు. అతను నన్ను ఎంత లవ్ చేస్తాడనేది నేను మాటల్లో చెప్పలేను. నేను కూడా అంతే లవ్ చేస్తాను. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపుములో’ సినిమాలు కలిసి చేశాం. ‘అల వైకుంఠపుములో’ ఓ రేంజ్ సినిమా. అతని పెర్ఫార్మన్స్.. మేమిద్దరం డిస్కస్ చేసుకునేవాళ్లం”

”పుష్ప సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు గురువు గారూ.. నాకు అవార్డ్ వచ్చింది గురువు గారూ అంటూ చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. మనం చేసే క్యారక్టర్ ని మనం కన్విన్స్ చేయగలిగితే, అవతలి వాళ్ళు ఎవరైనా కన్విన్స్ అవుతారు. వాడెవడో అజ్ఞానంతో అమాయకత్వంతో నన్ను నెగిటివ్ సైడ్ తీసుకెళ్లాలని చూసినా.. మీరు పొరపాటున కూడా వెళ్లొద్దు” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అసలు ‘పుష్ప 2’ లాంటి సినిమా తీయడం ఎవడి వల్ల అవుతుందండీ?. పైగా అది ‘నాన్నకు ప్రేమతో’ సుకుమార్ తీసిన సినిమా. వాళ్లిద్దరూ కలిసి మామూలు సినిమా చేసారా?. ఎవరు పడితే వాళ్ళు ‘పుష్ప’ లాంటి సినిమా చేయమనండి.. చూస్తాను. అది అసాధ్యం.. ఎవడివల్లా కాదు. వాళ్లిద్దరూ నిజంగానే సాధించారు అని అన్నారు.

”నేషనల్ అవార్డ్ మీరనుకున్నంత ఈజీ కాదు. అది కొట్టాలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలి.. ఆరోజున ఎంత సంతోషపడిపోయాం. అందరం అర్జున్ ని పైకి ఎత్తేసాం. హ్యాట్సాఫ్ అల్లు అర్జున్.. నువ్వు ఇంకా ఎన్నెన్నో గొప్ప విషయాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా అతని గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే.. నేను లైక్ చేయకుండా ఎలా ఉంటాను అండీ. వాడెవడో చాలా తక్కువ ఆలోచించాడు. మెచ్యూరిటీ లెవల్స్ లేవు. నా గురించి తెలిసినవాళ్ళు అయితే అలా రాయరు. కాబట్టి నన్ను కూడా మీలో ఒక వ్యక్తిగా చూడండి. అల్లు అర్జున్.. ఐ లవ్ యూ” అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

షెకావ‌త్ స‌ర్ తో యానిమ‌ల్ బ్యూటీ రొమాన్స్!

0

ఫ‌హాద్ ఫాజిల్ ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. మాలీవుడ్ లో ఎంతో పెద్ద స్టార్ అయినా? తన స్టార్ డ‌మ్ రెట్టింపు అవ్వ‌డానికి కార‌ణం మాత్రం టాలీవుడ్ అన్న‌ది వాస్త‌వం. ‘పుష్ప’ సినిమాలోకి ప‌హాద్ ఎంట‌ర్ అయిన త‌ర్వాత న‌టుడిగా ఫ‌హాద్ కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ల‌యాళంలో న‌టించిన సినిమాలు సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ అనువాదం అవ్వ‌డం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న సినిమాలు కేవ‌లం మాలీవుడ్ కే ప‌రిమిత‌మ‌య్యేవి.

కానీ నేడు ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లో రిలీజ్ అవుతున్నాయి. ‘పుష్ప ది రైజ్’ రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు నాలుగు సినిమాలొచ్చాయి. వాటికి ఇక్క‌డా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ‘పుష్ప‌-2’ విజ‌యంతో అన్ని భాష‌ల్లోనూ తిరుగు లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ఫ‌హాద్ పాజిల్ బాలీవుడ్ లోకి ఎంట‌ర్ అవుతున్నాడు. ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఇడియ‌ట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో ఫహాద్ కి జోడీగా యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తీ డిమ్రీని హీరోయిన్ గా ఎంపిక చేయ‌డం విశేషం. ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. హీరో-హీరోయిన్ మ‌ధ్య కొన్ని ఇంటిమేట్ స‌న్నివ‌శాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాతో ఫ‌హాద్ హిందీకి వెళ్ల‌డం పై ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేసారు. చాలా కాలంగా హిందీ సినిమాలు చేయాల‌నుకున్నా? అవ్వ‌లేదు. ఆ అవ‌కాశం ఇప్పుడు ల‌భించింది. న‌టుడిగా ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చిన వ‌ద‌ల‌ను. అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసిన‌ప్పుడే ర‌క‌ర‌కాల పాత్ర‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Fathima రాకతో Kareem ఇంట్లో Cooking Fire ?|| Zubeda Ali || Zubeda Ali Vlogs

0

Fathima రాకతో Kareem ఇంట్లో Cooking Fire ?|| Zubeda Ali || Zubeda Ali Vlogs

ఆదివారం With స్టార్ మా పరివారం Shooting || BTS || Sreemukhi

0

ఆదివారం With స్టార్ మా పరివారం Shooting || BTS || Sreemukhi

స్పిరిట్.. ప్రభాస్ ఇలా ఉంటే అరాచకమే..

0

ప్రభాస్ ప్రతీ సినిమాతో కూడా పాన్ ఇండియా స్టార్‌గా తన క్రేజ్‌ని మరో స్థాయికి తీసుకువెళుతున్నాడు. ప్రస్తుతం ఏ హీరోకు లేనంత స్టార్ లైనప్ ఆయన సొంతం. నెవ్వర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ త్వరలో స్టార్ట్ చేయబోయే కొత్త సినిమా ‘స్పిరిట్’ గురించి భారీ ఆసక్తి నెలకొంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనే కాదు అభిమానులలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పిక్‌ను ప్రభాస్ అభిమానులు ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశారు. ప్రభాస్ పోలీస్ యూనిఫార్మ్‌లో సిగరెట్ తాగుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఆ ఫోటో చూసిన మరికొందరు అభిమానులు ‘స్పిరిట్’లో ఆయన లుక్ ఇదేనా? అని ఆశగా అడుగుతున్నారు. ఈ ఫోటోలో ప్రభాస్ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ అటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత వైరల్ చేసేస్తున్నారు.

నేక ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’, ‘సలార్ పార్ట్ 2’, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ‘స్పిరిట్’ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇది ప్రభాస్ మొదటి పోలీస్ రోల్ కావడంతో ఆ పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది.

స్పిరిట్ గురించి ఇదివరకే వచ్చిన సమాచారం మేరకు, ఇది ఒక పవర్ఫుల్ కథతో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్న కథాంశంతో ఉంటుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ అంచనాలు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

ఈ సినిమా చిత్రీకరణ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ, ప్రభాస్ లుక్ కోసం సోషల్ మీడియాలో అభిమానులు అంచనాలు పెంచుకుంటూ వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ లుక్‌లో కనిపిస్తే, ఆయనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మరింత ఆదరణ లభించనుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక ‘స్పిరిట్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఆయ‌న వెన‌క్కి త‌గ్గితే చ‌ర‌ణ్ చెల‌రేగిపోయేలా!

0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న `గేమ్ ఛేంజ‌ర్` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి దేశ‌మంతా ప్ర‌చారం చేయబోతున్నారు. ఈసినిమాపై అంచ‌నాలు ఇప్ప‌టికే పీక్స్ చేరాయి. ముఖ్యంగా ఈ సినిమా స‌క్సెస్ శంక‌ర్ కి అత్యంత కీల‌క‌మైంది. ఈ హిట్ తో త‌న‌పై కోలీవుడ్ లో త‌న‌పై ఉన్న విమ‌ర్శ‌ల‌న్నింటికి చెక్ పెట్టాల‌ని ఎంతో ప్రీ ప్లాన్డ్ గా రంగంలోకి దిగి చేసిన ప్రాజెక్ట్ ఇది.

అలాగే రామ్ చ‌ర‌ణ్ కూడా రాజ‌మౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి. తొలి సోలో పాన్ ఇండియా స‌క్సెస్ గా గేమ్ ఛేంజ‌ర్ నిల‌వాలి. ఇలా ఎవ‌రిపై ఉండాల్సిన ఒత్తిళ్లు వారిపై ఉన్నాయి. రీజ‌న‌ల్ స‌హా హిందీ మార్కెట్ వ‌ర‌కూ ప‌ర్వాలేదు. కానీ కోలీవుడ్ కి వ‌చ్చే స‌రికే తెలుగు సినిమాల‌కు స‌రైన ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. అయితే ఈసారి శంక‌ర్ తెరకెక్కించిన చిత్రం కాబ‌ట్టి అక్క‌డ ప్రేక్ష‌కులు సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ ఎదురు చూస్తున్నారు.

పొంగ‌ల్ రేసులో కోలీవుడ్ నుంచి అజిత్ కూడా పోటీ ప‌డుతున్నాడు. అజిత్ న‌టిస్తోన్న‌ `గుడ్ బ్యాడ్ అగ్లీ` వాయిదా ప‌డినా `విదామూయార్చి`ని రిలీజ్ చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కోలీవుడ్ నుంచి పొంగ‌ల్ కానుక‌గా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇది. దీంతో `గేమ్ ఛేంజ‌ర్` పై కొంత ప్ర‌భావం అక్క‌డ త‌ప్ప‌దు. అయితే ఇప్పుడా స‌మీక‌ర‌ణాలు మారుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. `విదా ముయార్చి` పై కాపీ రైట్ ఆరోప‌ణ‌లున్నాయి.

ఓ హాలీవుడ్ సినిమాకి కాపీ అనే ప్ర‌చారం ఇప్ప‌టికే జ‌రుగుతోంది. ఇంత వ‌ర‌కూ సినిమాకి ప్ర‌చారం ప‌నులు కూడా మొద‌లు పెట్ట‌లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ పై అనిశ్చితి నెల‌కొంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అన్న డౌట్ వ్య‌క్త‌మ‌వుతోంది. వాయిదా పడుతుంద‌నే ప్ర‌చారం కూడా కొన్ని మీడియా సంస్థ‌ల్లో జ‌రుగుతోంది. అదే గ‌నుక జ‌రిగితే `గేమ్ చేంజ‌ర్` అక్క‌డ మార్కెట్ ప‌రంగా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది.

దిల్లీలో దేశ ప్ర‌ధానితో స్టార్ల భేటీ దేనికోసం?

0

నిరంత‌ర ప్ర‌జాకార్య‌క్ర‌మాలు, పార్టీ కార్య‌క‌లాపాల‌తో త‌ల‌మున‌క‌లుగా ఉండే రాజ‌కీయ నాయ‌కులు సినీతార‌ల కోసం స‌మ‌యం కేటాయించ‌డం చాలా అరుదైన విష‌యం. సాక్షాత్తూ దేశ ప్ర‌ధాని ఇప్పుడు సినిమా స్టార్లతో స‌మావేశం కోసం స‌మ‌యం కేటాయించారు. అయితే ఈ స‌మావేశానికి అంత‌టి ప్రాధాన్య‌త ఉందా?

ఈ మంగ‌ళ‌వారం నాడు కపూర్ కుటుంబ సభ్యులు – ఖాన్‌లు.. ఇత‌ర‌ బాలీవుడ్ తారలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేక సమావేశం కోసం న్యూఢిల్లీకి వెళ్లారు. రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీతో చ‌ర్చించేందుకు వీరంతా వెళ్లార‌ని స‌మాచారం. దేశంలోని ప‌లు మెట్రో న‌గ‌రాల్లో క‌పూర్ చలనచిత్రోత్సవం జరగడానికి ముందు మోదీతో గౌర‌వ స‌మావేశ‌మిద‌ని తెలిసింది. భారతీయ సినీరంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా రాజ్ కుమార్ పేరు సుస్థిర‌మైంది. రాజ్ క‌పూర్ శ‌త‌దినోత్స‌వ‌ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని క‌పూర్ కుటుంబ సభ్యులు ఆహ్వానించారని సమాచారం.

RK ఫిల్మ్ ఫెస్టివల్ ఈ వారంలో 34 నగరాల్లోని 101 సినిమా థియేట‌ర్ల‌లో జరుగుతుంది. భారీ వేడుక‌ల సంద‌ర్భంగా రాజ్ క‌పూర్ క్లాసిక్ సినిమాల‌ను రీమాస్ట‌రింగ్ చేసి థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. డిసెంబరు 13 నుండి డిసెంబర్ 15 వరకు వివిధ నగరాల్లోని పివిఆర్-ఐనాక్స్ , సినీపోలిస్ సినిమా థియేటర్లలో క‌పూర్ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ ఉత్సవంలో 10 రాజ్ కపూర్ చిత్రాలను ప్ర‌ద‌ర్శిస్తారు. ఆగ్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, జాగ్తే రహో, జిస్ దేశ్ మే గంగా బెహ్తీ హై, సంగం, మేరా నామ్ జోకర్, బాబీ , రామ్ తేరీ గంగా మైలీ ప్ర‌ధానంగా ప్ర‌ద‌ర్శించే చిత్రాలు అని తెలిసింది. ప్ర‌ధానిని క‌లిసిన వారిలో ప‌లువురు బాలీవుడ్ తార‌లు ఉన్నారు.

రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ , సైఫ్ అలీ ఖాన్‌ సహా కుటుంబంలోని పలువురు సభ్యులు దిల్లీలో ప్రధానిని కలిసారు. ఆదార్ జైన్ అతడి తండ్రి మనోజ్ జైన్, అనిస్సా మల్హోత్రా కూడా మోదీతో స‌మావేశమ‌య్యారు.

శివ స్వామి ఇరుముడి || Ayyappa Irumudi || Mahishivan || Tamada Media

0

శివ స్వామి ఇరుముడి || Ayyappa Irumudi || Mahishivan || Tamada Media

నటుడిని కాక‌పోతే అండర్‌వరల్డ్‌లో ఉండేవాడిని

0

తాను న‌టుడిని కాక‌పోయి ఉంటే, పాతాళంలోకి ప‌డిపోయేవాడిన‌ని, అండ‌ర్ వ‌ర‌ల్డ్‌లో ఉండేవాడిని అని అన్నారు ప్ర‌ముఖ‌ న‌టుడు నానా ప‌టేక‌ర్. నేను చాలా హింసాత్మక వ్య‌క్తిని. ఎక్కువగా మాట్లాడను. నేను చేసే ప‌నితో మాట్లాడటానికి ప్ర‌య‌త్నిస్తాను. నేను ఇప్పుడు తక్కువ హింసాత్మకంగా ఉన్నాను. కానీ ఈ రోజు కూడా ఎవరైనా నన్ను టార్గెట్ చేస్తే వారిని కొట్టేస్తాను! అని అన్నారు. నేను నటుడిని కాకపోతే పాతాళంలో ఉండేవాడిని.. దీని గురించి చాలా సీరియస్‌గా ఉన్నాను.. అని త‌న‌లోని వైల్డ్ యాంగిల్ గురించి ఏమాత్రం దాచుకోకుండా బ‌హిర్గ‌తం చేసారు. గతంలో తాను చాలా గొడవల్లో ఉన్నాన‌ని నానా అంగీకరించాడు.

సిద్దార్థ్ క‌న్న‌న్ తో చాటింగ్ సెష‌న్ లో నానా పటేకర్ ఇలాంటి క‌ఠిన‌మైన నిజాల్ని బ‌య‌ట‌పెట్టారు. ఇటీవ‌ల‌ వనవాస్ సెట్స్‌లో అభిమానిని చెంపదెబ్బ కొట్టడం గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. ఒక‌రిని చెంప దెబ్బ కొట్ట‌డం త‌ప్పేన‌ని కూడా నానా ఒప్పుకున్నారు. అయితే ఎవరిపైన అయినా తమ ప్రేమను వ్యక్తపరిచే సమయం సంద‌ర్భం, చోటు స‌రైన‌వా కాదా? అన్న‌ది అభిమానులు లేదా ప్ర‌జ‌లు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నానా పేర్కొన్నాడు.

తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన నానా పటేకర్ అత‌డు ఆ స‌మ‌యంలో అలా చేయ‌కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

వారణాసిలో నానా షూటింగ్ లో పాల్గొంటున్న క్ర‌మంలోనే ఆ వ్య‌క్తి వ‌చ్చాడు. సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించాడు. వెంట‌నే నానా చాచి కొట్టారు. అది కెమెరాలో రికార్డ‌యిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో నానా ఆ అభిమానికి క్షమాపణలు చెప్పాడు. ”మేము షాట్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్నామని అతడికి తెలియదు. షాట్స్ మధ్యలోకి వచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. నేను అతనిని చెంపదెబ్బ కొట్టాను.. అది తప్పు” అని కూడా నానా ప‌టేక‌ర్ అన్నారు.

కానీ ఒక వ్యక్తి పట్ల మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక చోటు ఉంటుంది. నేను షాట్ పూర్తి చేసిన తర్వాత అతడు వచ్చి ఉంటే నాకు సమస్య ఉండదు. అయితే అది పెద్ద వివాదంగా మారింది! అని అన్నారు. ఇదే ఇంట‌ర్వ్యూలో నానా ప‌టేక‌ర్ కామోషి సెట్లో సంజ‌య్ లీలా భ‌న్సాలీతో గొడ‌వ ప‌డిన విష‌యాన్ని కూడా ప్ర‌స్థావించారు. తాను చాలా మంది న‌టులు, ద‌ర్శ‌కుల‌ను కూడా కొట్టాన‌ని నానా అంగీక‌రించారు. నానా పటేకర్ నటించిన ‘వనవాస్’ డిసెంబర్ 20న విడుదల కానుంది. అనీల్ శ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రుతి మరాతే, అశ్విని కాళేష్క‌ర్ త‌దిత‌రులు న‌టించారు.

హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌తో రాయన్‌ ఏంటో కథ..!

0

ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించి, హీరోగా నటించిన ‘రాయన్‌’ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా అన్ని వర్గాల వారిని మెప్పిస్తోంది. అన్ని భాషల్లోనూ రాయన్‌కి మంచి స్పందన లభించింది. రాయన్ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తూ ఉన్నాడు. ఆ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ‘కుబేరా’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ధనుష్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేసే సత్తా ఉన్న నటుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కుబేరా సినిమా విడుదలకు రెడీ అవుతున్న ఈ సమయంలో ధనుష్ కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతూ ఉన్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్‌ ముద్దుగుమ్మ, లేటెస్ట్‌ సెన్షేషన్‌ అయిన సిడ్నీ స్వీనితో ధనుష్ టీం చర్చలు జరుపుతున్నారు. ఆమెను ధనుష్‌ తో త్వరలోనే చూడబోతున్నాం అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సిడ్నీ ప్రస్తుతం హాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ నటి. ఆమెతో ఎన్నో సినిమాలను చేసేందుకు ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ దేశ విదేశాల నుంచి సంప్రదిస్తూ ఉంటారట. అలాంటి స్టార్‌ తో ధనుష్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

గతంలో ధనుష్ హాలీవుడ్‌ సినిమాలు చేశాడు. కనుక మరోసారి ఆయన హాలీవుడ్‌ సినిమాను చేయబోతున్నాడా లేదంటే ఆయన ఒక సౌత్‌ ఇండియన్‌ సినిమా కోసం లేదా హిందీ సినిమా కోసం ఆమెను సంప్రదించాడా అనేది తెలియడం లేదు. హాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఇంగ్లీష్ సినిమా చేస్తేనే బాగుంటుంది కనుక ఆమెను హాలీవుడ్‌ మూవీకే సంప్రదించి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఆకట్టుకునే కథ, కథనంతో ధనుష్ సినిమాలు ఉంటాయి కనుక సిడ్నీ స్వీని ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పవచ్చు.

ధనుష్ గతంలో చేసిన హాలీవుడ్‌ సినిమాలు ఒక మోస్తరు వరకే ప్రేక్షకుల వద్దకు వెళ్లాయి. అందుకే ఈసారి కాస్త ఎక్కువ మందికి రీచ్‌ కావాలి అంటే సిడ్నీ వంటి స్టార్‌ తో రొమాన్స్ చేయడం వల్ల వర్కౌట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ధనుష్ ఈ సారి హాలీవుడ్‌ స్టార్‌తో చర్చలు జరుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్న ధనుష్‌ ఎందుకు ఇలాంటి హాలీవుడ్‌ ప్రయత్నాలు చేస్తారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నటుడు అన్నప్పుడు అన్ని భాషల్లో నటించాలి, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలి అనేది ధనుష్ యొక్క అభిప్రాయంగా ఆయన ఫ్యాన్స్‌ చెబుతూ ఉంటారు.

అప్పుడు చిరుతో ఇప్పుడు చ‌ర‌ణ్‌తో

0

టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ల ప్ర‌వేశం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అమితా బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, బాబి డియోల్, అర్జున్ రాంపాల్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి స్టార్లు గ‌తంలో తెలుగు సినిమాల్లో న‌టించారు. అమితాబ్, బాబి డియోల్ ఇటీవ‌ల వ‌రుసగా సౌత్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. క‌ల్కి 2898 ఏడిలో అమితాబ్ న‌టించారు. త‌ద‌ప‌రి ఈ సినిమా సీక్వెల్ లోను ఆయ‌న క‌నిపిస్తారు. మ‌రోవైపు బాబి డియోల్ యానిమ‌ల్, కంగువ త‌ర్వాత బాల‌కృష్ణ సినిమాలో క‌నిపించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గానే స‌ల్మాన్ ఖాన్ త‌న స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాలో న‌టించ‌నున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఉప్పెన ఫేం బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. స‌ల్మాన్ గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ లో న‌టించారు.

ఈ మూవీ కోసం చ‌ర‌ణ్ స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ ని సంప్ర‌దించ‌గా, అత‌డు కాద‌న‌లేక‌పోయాడు. చిరంజీవి- చ‌ర‌ణ్‌ల‌కు స‌ల్మాన్ ఖాన్ అత్యంత స‌న్నిహితుడు. ఇరు కుటుంబాల న‌డుమా మంచి సాన్నిహిత్యం ఉంది. స‌ల్మాన్ చిరు కుటుంబం ఆతిథ్యం ఇస్తుంది. అలాగే ముంబై వెళితే చ‌ర‌ణ్ త‌ప్ప‌నిస‌రిగా స‌ల్మాన్ ని క‌లుస్తుంటారు.

అంత మంచి బాండింగ్ ఉంది గనుక‌.. ఇప్పుడు చ‌ర‌ణ్‌- బుచ్చిబాబు చిత్రంలోను స‌ల్మాన్ న‌టించేందుకు అభ్యంత‌రం చెప్ప‌ర‌ని గుస‌గుస వినిపిస్తోంది. స‌ల్మాన్ ఖాన్ స్థాయికి త‌గ్గ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ను బుచ్చిబాబు తీర్చిదిద్దార‌ట‌. అయితే స‌ల్మాన్ కి క‌థ‌ను నేరేట్ చేసారా లేదా? అన్న‌ది వేచి చూడాలి.

మైసూర్ లో ఇటీవ‌లే మొద‌టి షెడ్యూల్ ని ప్రారంభించిన చిత్ర‌బృందం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కి షూటింగ్ ని షిఫ్ట్ చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. చ‌ర‌ణ్ సినిమాలో స‌ల్మాన్ ఖ‌రారైతే, గాడ్ ఫాద‌ర్ త‌ర్వాత నేరుగా రెండో తెలుగు సినిమాకి స‌ల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన‌ట్టే.

చుట్టమల్లే వచ్చి అత్తారింటికెళ్ళిపోయింది || Zubeda Ali || Zubeda Ali Vlogs

0

చుట్టమల్లే వచ్చి అత్తారింటికెళ్ళిపోయింది || Zubeda Ali || Zubeda Ali Vlogs

బిగ్ బీని టచ్ చేసిన పుష్ప రాజ్..!

0

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 సంచలనాల గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. పుష్ప 1 తో పోల్చితే కథ పరంగా పార్ట్ 2 పెద్దగా ఏమి లేకపోయినా సరే పుష్ప 2 మొత్తాన్ని కూడా అల్లు అర్జున్ భుజాన వేసుకుని నడిపించేశాడు. ఐతే ఈ సినిమా చేస్తున్న బాక్సాఫీస్ హంగామా చూసి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు.

పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ గారే తన ఇన్ స్ప్రేషన్ అని.. ఆయన నేషనల్ లెవెల్ మెగాస్టార్ అని అన్నారు. ఆయన స్పూర్తితోనే తాను సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఐతే ఆ వీడియోకి కాస్త లేట్ గా స్పందించారు అమితాబ్ బచ్చన్. అల్లు అర్జున్ జీ అంటూ ప్రేమగా మొదలు పెట్టిన అమితాబ్ నీ వర్క్ కి మేమంతా అభిమానులమే నువ్వు కూడా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నావు అంటూ ట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ పుష్ప 2 బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కన్నా బాలీవుడ్ లో ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన పుష్ప రాజ్ పాత్ర అక్కడ బీ టౌన్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేస్తుంది. సినిమాకు అసలే నార్త్ సైడ్ దుమ్ము దులిపేస్తున్న ఈ టైం లో అమితాబ్ బచ్చన్ వేసిన ట్వీట్ కూడా సినిమా మీద ఇంకాస్త ఎఫెక్ట్ పడేలా చేస్తుంది.

కచ్చితంగా పుష్ప 2 కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈ టైం లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా అల్లు అర్జున్ గురించి ట్వీట్ చేయడం చూస్తుంటే పుష్ప 2 తాకిడి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 2 తెలుగు రెండు రాష్ట్రాలకు ఈక్వల్ గా కాదు ఒక సందర్భంలో ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. బీ టౌన్ ఆడియన్స్ మొత్తాన్ని పుష్ప 2 ఒక మాస్ వైబ్ లోకి తీసుకెళ్లింది. తప్పకుండా ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు సృష్టించేలా ఉంది. పుష్ప 2 ఆల్ టైం రికార్డులతో బాలీవుడ్ లో దూసుకెళ్తుంది. చూస్తుంటే బాలీవుడ్ లోనే ఈ సినిమా 500 కోట్లు దాటి నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించేలా ఉంది.

మంచు మనోజ్ కడుపు, వెన్నెముకలో గాయాలు… విష్ణు కీలక నిర్ణయం!!

0

ఆస్తుల విషయంలో మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారంటూ కూడా ప్రచారం తీవ్రంగా జరిగింది.

ఈ నేపథ్యంలో విష్ణు పీఅర్వో టీమ్ స్పందించింది.. అదంతా అసత్య ప్రచారం అని కొట్టివేసింది. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. ఈ క్రమంలో… ఆదివారం మనోజ్ కాలి గాయంతో ఆసుపత్రికి వచ్చారు. దీంతో… అటు ఇండస్ట్రీలోనూ, ఇటు మీడియాలోనూ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

ఆ సమయంలో నడవాడనికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లు మనోజ్ కనిపించారు. అయితే… కాలికి గాయం ఎలా అయ్యింది? ఉదయం నుంచి వస్తున్న వార్తలు నిజమేనా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మనోజ్ కానీ, ఆయన సతీమణి కానీ స్పందించలేదు! ఈ నేపథ్యంలో… మనోజ్ మెడికో లీగల్ రిపోర్ట్ వచ్చిందనే విషయం తెరపైకి వచ్చింది.

అవును… ఆదివారం మనోజ్ ఆస్పత్రికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. దీనికి సంబంధించిన మెడికో లీగల్ రిపోర్ట్ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా… మనోజ్ కు కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని.. మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని తేలిందని అంటున్నారు!

మరోవైపు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని అంటున్నారు . ఈ నేపథ్యంలో… స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురుకీ పోలీసులు సూచించినట్లు చెబుతున్నారు!

ఆ సంగతి అలా ఉంటే… దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్న అనంతరం మనోజ్ ను కలుస్తున్నట్లు తెలుస్తుంది . మరోపక్క.. అంతకంటే మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టె ఛాన్స్ ఉంది అని అంటున్నారు . దీంతో..మనోజ్ ప్రెస్ మీట్ పై తీవ్ర ఆసక్తి నెలకొందని తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement