Home Blog Page 5

నెల ముందుగానే ఆ పని పూర్తి చేసిన ‘డాకు మహారాజ్‌’

0

ఈ రోజుల్లో చాలా మంది దర్శకులు పెద్ద హీరోల సినిమాలను చివరి నిమిషం వరకు చెక్కుతూనే ఉంటారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంకా షూటింగ్‌ లేదా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌, రీ రికార్డింగ్‌ అంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ డాకు మహారాజ్ సినిమా విషయంలో అలా జరగడం లేదు. ఇటీవలే సినిమా షూటింగ్‌ పూర్తి చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయడం ద్వారా హైప్‌ క్రియేట్‌ చేయడం జరిగింది. ఇక సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజాగా డాకు మహారాజ్ షూటింగ్‌ పూర్తి చేసిన దర్శకుడు బాబీ ఇప్పుడు బాలకృష్ణతో డబ్బింగ్‌ సైతం చెప్పించారు. దర్శకుడు బాబీ చాలా స్పీడ్‌గా ఉన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఇంకా విడుదలకు నెల రోజుల సమయం ఉంది. అయినా కూడా వర్క్ పూర్తి చేయడం నిజంగా చాలా పెద్ద విషయం అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో డాకు మహారాజ్ సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేయడం కోసం ప్రతి రోజు ఏదో ఒక విషయాన్ని, వార్తని షేర్‌ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బాలయ్య డబ్బింగ్‌ పూర్తి అనే విషయాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోందని, అది కూడా అతి త్వరలో పూర్తి కాబోతుందని దర్శకుడు బాబీ సన్నిహితులు చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూఎస్‌లో ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి, అదే సమయంలో పోటీ కూడా బాగానే ఉంటుంది.

సంక్రాంతికి ఇప్పటికే డాకు మహారాజ్ సినిమాకు పోటీగా రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్ సినిమా రాబోతుంది. ఆ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు, ఇక వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైతం సంక్రాంతి పోటీలో నిలిచింది. కనుక ఈ రెండు సినిమాలతో పోటీ పడాలి అంటే కంటెంట్‌తో పాటు ప్రమోషన్‌ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అందుకే డాకు మహారాజ్ సినిమాకు భారీ ఎత్తున ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగానే వర్క్‌ పూర్తి చేశారని తెలుస్తోంది.

కంటెంటే కింగ్.. కొత్త కథ చెప్పు, క్రేజీ ఆఫర్ పట్టు!

0

ఇప్పుడు టాలీవుడ్ హీరోల ఆలోచనలన్నీ కొత్తదనం చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రేక్షకులు కొత్త కంటెంట్ కోరుకోవడంతో, అంతా ఆ వైపుగా పరుగులు తీస్తున్నారు. కొత్త కథలను తెర మీదకు తీసుకురావడానికి, తమని తాము సరికొత్త పాత్రల్లో ఆవిష్కరించుకోడానికి, ఇంకాస్త కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నవతరం ఆలోచనలతో వచ్చే కొత్త దర్శకులకు, ఒకటీ రెండు సినిమాల అనుభవమున్న యంగ్ డైరెక్టర్స్ కు కూడా అవకాశాలు అందిస్తున్నారు.

‘భోళా శంకర్’ తో భంగపడ్డ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ఫ్యాన్ బాయ్స్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో హీరో నాని సమర్పణలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. ‘దసరా’తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్.. రెండో మూవీ సెట్స్ మీద వుండగానే ఇప్పుడు చిరుతో సినిమా ఓకే చేయించుకోవడం విశేషం. ఇది బాస్ కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ అని చెప్పబడుతోంది.

సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకునే కింగ్ అక్కినేని నాగార్జున.. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి విజయ్ బెన్నీ వరకూ అనేక మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు ఆయన మరో ఇద్దరు యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘హుషారు’, ‘ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన హర్ష కొనుగంటితో నాగ్ ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. అలానే నవీన్ అనే తమిళ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వీటిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత విక్టరీ వెంకటేశ్ చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణతో వెంకీ ఓ మూవీ చేస్తారని గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. కథా చర్చలు పూర్తయ్యాయని, సంక్రాంతి తర్వాత ఈ ప్రాజెక్టును ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ‘హాయ్ నాన్న’తో దర్శకుడిగా పరిచయమైన శౌర్యువ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. స్టోరీ లైన్ కు తారక్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, దర్శకుడు స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడని టాక్.

RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ చేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తన తర్వాతి చిత్రాన్ని బుచ్చిబాబు సానా చేతుల్లో పెట్టారు. ‘ఉప్పెన’తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా మాత్రమే. ఆయన చెప్పిన కథ నచ్చడంతో చెర్రీ వెంటనే పచ్చజెండా ఊపారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లింది. ఇక మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో మైలురాయి 75వ సినిమా బాధ్యతను డెబ్యూ డైరెక్టర్ కు అప్పగించారు. ‘మాస్ జాతర’ అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇలా టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని కాంబినేషన్స్ కుదురుతున్నాయి. ‘కంటెంటే కింగ్’ అని నమ్మిన స్టార్ హీరోలు.. చిన్నా పెద్దా అని తేడాలు చూడకుండా కొత్తవారికి అవకాశాలు అందిస్తున్నారు. వైవిధ్యమైన బలమైన కథతో వస్తే చాలు, దర్శకుల అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకుండా ముందుకు సాగుతున్నారు. మరి వీరిలో ఎవరెవరు అగ్ర హీరోల నమ్మకాన్ని నెలబెట్టుకుని, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారో చూడాలి.

పుష్ప 2: తమన్ మ్యూజిక్ వాడలేదు సరే.. మరి ఎంతిచ్చారు?

0

‘పుష్ప: ది రూల్’ విడుదల అనంతరం మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ హిట్ గా దూసుకుపోతోంది. అయితే విడుదలకు అనేక రకాల గాసిప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ పనితీరుపై దర్శకుడు సుకుమార్ తో పాటు బన్నీ పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో ముగ్గురు కొత్త సంగీత దర్శకులను ట్రై చేసినట్లు తేలిపోయింది.

బన్నీ కోరిక మేరకు తమన్ వచ్చి తనకు ఇచ్చిన వర్క్ రెండు వారాల్లో ఫినిష్ చేసి ఇచ్చాడు. ఇక తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఇంకాస్త ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. అలాగే మైత్రి వారి సలహా మేరకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌ ను రంగంలోకి దింపారు. ముగ్గురు కూడా తమకిచ్చిన బాధ్యతను పూర్తి చేసి ట్రాక్స్ అందజేశారు. అయితే మొదట తమన్ వర్క్ సుకుమార్‌కు పూర్తిగా నచ్చకపోవడంతో, ఆయన పని పూర్తిగా పక్కనపెట్టారు.

అజనీష్ వర్క్ కొంత మెప్పించినప్పటికీ, సినిమాలో ఉపయోగించే స్థాయిలో అనిపించలేదట. ఇక చివరకు సామ్ సీఎస్ వర్క్‌ను మాత్రమే వాడారు. సామ్ నేపథ్య సంగీతం ప్రధానంగా పోలీస్ స్టేషన్ సన్నివేశంలో వినిపించడం జరిగింది. అలాగే జాతర ఎపిసోడ్ కు కూడా అతనే BGM ఇచ్చినట్లు చెప్పాడు. ఈ ఎపిసోడ్‌లో పుష్ప పాత్రకు తగిన ఎలివేషన్ ఇవ్వడంలో సామ్ బీజీఎం బాగా ఫిట్ అయింది.

ఇక క్రెడిట్స్ లో దేవితో పాటు సామ్ పేరు కనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్‌లో దేవిశ్రీ ప్రసాద్, సామ్ సీఎస్ మధ్య బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తీవ్ర చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే చివరికి దర్శకుడు సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ వర్క్‌ను ఎంచుకున్నారని టాక్. ఆల్రెడీ పుష్ప-1లో దేవిశ్రీ అందించిన సంగీతం ఎంత పెద్ద హిట్టో తెలుసు. దాంతో, ఆయనకు ఈ సీక్వెల్‌లో కూడా పూర్తి క్రెడిట్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని ఆధారంగా సినిమా టైటిల్స్‌లో సంగీత దర్శకుడిగా దేవిశ్రీ పేరును ప్రధానంగా చూపించారు. సామ్ సీఎస్ పేరు మాత్రం అదనపు స్కోర్ విభాగంలో మాత్రమే చూపబడింది.

ఇక దేవి కాకుండా ముగ్గురి నుంచి తీసుకున్న ట్రాక్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం గమనార్హం. సామ్, తమన్, అజనీష్ ముగ్గురికీ తలో కోటి రూపాయలు ఇచ్చారు. అయితే, తమన్, అజనీష్ ట్రాక్స్ ఉపయోగించకపోయినా కూడా, సరే వారి పనికి తగ్గట్లే పారితోషకం ఇచ్చారట. అదనపు సంగీతం కోసం మొత్తం రూ.3 కోట్లు ఖర్చు చేయడం పెద్ద చర్చగా మారింది. ఇదే సమయంలో, దేవిశ్రీ ప్రసాద్‌కు మ్యూజిక్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చెల్లించిన మొత్తం కూడా భారీగా ఉంది. గతంలో దేవి, తమన్ ఇద్దరూ మణిశర్మ దగ్గర శిష్యులుగా పని చేశారు, ఇక వారి మధ్య ఉన్న గ్యాప్ ఇప్పుడు మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది.

ఆ రెండు చిత్రాల‌పై అడ‌వి శేష్ స‌ర్ ప్రైజ్ ఇలా!

0

అడ‌వి శేషు నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. చివ‌రిగా 2022 లో `హిట్ ది సెకెండ్ కేస్` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి మెప్పించాడు. ఆ త‌ర్వాత శేషు న‌టిస్తున్న సినిమాలు సెట్స్ లో ఉన్నాయి అనే మాట త‌ప్ప వాటి అప్ డేట్స్ మాత్రం పెద్ద‌గా రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా `గుఢ‌చారి`కి సీక్వెల్ గా `గుఢ‌చారి-2` సెట్స్ లో ఉంది. దాంతో పాటు `డెకాయిట్ ఏ ల‌వ్ స్టోరీ` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాలు ప్రారంభో త్స‌వం..రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లై చాలా కాల‌మ‌వుతుంది.

కానీ అప్ డేట్స్ మాత్రం స‌వ్యంగా రావ‌డం లేదు. `డెకాయిట్` సినిమాకు శేష్ రైట‌ర్ గా కూడా ప‌ని చేస్తున్నాడు. మ‌రి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అంటే ఆ పెరుమాళ్ల‌కే తెలుసు అన్న‌ట్లుగానే స‌న్నివేశం క‌నిపిస్తుంది. సినిమాలు సెట్స్ లో ఉన్నాయి అనే మాట గానీ అవి ఎంత వ‌ర‌కూ షూటింగ్ పూర్త‌య్యాయి? ఎక్క‌డెక్క‌డ షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి? అనే అప్ డేట్ ఏదీ లేదు. తాజాగా ఏడాది ముగింపు నేప‌థ్యంలో శేష్ ట్విట‌ర్లోకి వ‌చ్చి ఇలా స‌ర్ ప్రైజ్ చేసాడు.

డిసెంబ‌ర్ లో `డెకాయిట్` స‌ర్ ప్రైజ్..జ‌న‌వ‌రిలో `గుఢ‌చారి2` స‌ర్ ప్రైజ్ అంటూ క‌వ్వింపు చ‌ర్య‌కు దిగాడు. సినిమా లు సెట్స్ లో ఉన్న అప్ డేట్ లేక‌పోవ‌డంతో జ‌నాలు కూడా ఈ రెండు సినిమాల గురించి మ‌ర్చిపోయారు. ఇప్ప‌టికే కొన్ని ర‌కాల ప్ర‌చార చిత్రాలు రిలీజ్ అయిన‌ప్ప‌టికీ కంటున్యూటీ అప్ డేట్ లేక‌పోవ‌డంతో ఈ ర‌క‌మైన ప‌రిస్థితి వ‌చ్చింది.

మ‌రి తాజాగా ఇచ్చిన రెండు అప్ డేట్లు ఏంటి? అంటే అతిగా ఆశ‌లు పెట్టు కోవ‌డానికి క‌నిపిచండం లేదు. టీజ‌ర్, ,ట్రైల‌ర్ లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అంచ‌నా. మ‌రి ఈ రెండు గాక ఇంకేదైనా సంథింగ్ స్పెష‌ల్ గా ప్లాన్ చేస్తున్నాడా? అన్న‌ది తెలియాలి.

It’s My Birthday? | Tejaswini Gowda | Amardeep Chowdary

0

It’s My Birthday? | Tejaswini Gowda | Amardeep Chowdary

స్వామి కోసం భిక్షం Preparations || Mahishivan || Tamada Media

0

స్వామి కోసం భిక్షం Preparations || Mahishivan || Tamada Media

ప్రశాంత్ వర్మకి మరో కొత్త టెన్షన్

0

‘అ!’ మూవీతో దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఈ ఏడాది ‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా 300 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ మూవీ స్టార్ట్ చేస్తానని ప్రకటించారు. అయితే హీరో దొరక్క కొద్ది రోజులు అది వాయిదా పడింది. ఎట్టకేలకు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో ‘జై హనుమాన్’ మూవీని ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ చేశారు.

అలాగే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో ఓ సూపర్ హీరో మూవీ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేస్తారనే సమయానికి క్యాన్సిల్ అయ్యిందనే న్యూస్ బయటకి వచ్చింది. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు రణవీర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక ‘జై హనుమాన్’ సినిమా బడ్జెట్ పెరగడంతో ‘హనుమాన్’ ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ వదిలేసుకుంది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చారు.

మరో వైపు నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే ఛాన్స్ ని ప్రశాంత్ వర్మ అందుకున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఈ మూవీ ఉండబోతోందని ప్రకటించారు. మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యి ఫిజికల్ అండ్ మెంటల్ గా సిద్ధం అయ్యాడు. ఇక డిసెంబర్ 5న మూవీ షూటింగ్ మొదలవుతుందనే సమయానికి ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు న్యూస్ బయటకొచ్చింది. మోక్షజ్ఞ ఆరోగ్యం బాగోలేకపోవడంతో సినిమా వాయిదా వేశామని, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

అయితే ఎందుకనో ఈ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీ అనుమాన స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ క్రియేటివ్ డిఫరెన్స్ వలన సినిమా హోల్డ్ లో పడిందని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కానీ క్యాన్సిల్ అయితే అది కచ్చితంగా ప్రశాంత్ వర్మ ఇమేజ్ కి దెబ్బ అవుతుందనే మాట వినిపిస్తోంది. రణవీర్ సింగ్ లాంటి స్టార్ తో ఒక ప్రాజెక్ట్ ఇప్పటికే క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు బాలయ్య కొడుకుతో సినిమా వాయిదా పడిందనే మాట నిజం అయితే ఒకే.

క్యాన్సిల్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మకి కొంత ప్రతికూల వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ప్రశాంత్ వర్మకి మెంటల్ టెన్షన్ తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అఖిల్ – జైనాబ్ : జంట బావుంది.. పెళ్లి తేదీ ఖ‌రారైందా?

0

అక్కినేని నాగ‌చైత‌న్య‌- శోభిత జంట వివాహం ఇటీవ‌ల రెగ్యుల‌ర్ గా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచిన టాపిక్. ఇంత‌లోనే అక్కినేని అఖిల్- జైనాబ్ రావ్ జీ జంట పెళ్లి గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఈ జంట నిశ్చితార్థం ఇప్ప‌టికే పూర్త‌యింది. త్వ‌రలోనే వివాహ తేదీ గురించిన అధికారిక‌ ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అంతా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఇంత‌కుముందు అఖిల్ నిశ్చితార్థం నుంచి అద్భుత‌మైన ఫోటోల‌ను షేర్ చేశారు నాగార్జున‌. అవ‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు మ‌రో కొత్త ఫోటోగ్రాఫ్ వెబ్ లో వైర‌ల్ గా మారుతోంది. జైనాబ్ త‌న కాబోయే భ‌ర్త అఖిల్ అక్కినేనితో!… ఈ ఫోటోకి క్యాప్ష‌న్ ఇది. అఖిల్- రావ్ జీ జంట ఈ ఫోటోగ్రాఫ్ లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. దీనికి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. “జంట బావుంది.. పెళ్లి తేదీ ఖ‌రారైందా?“ అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

నిజానికి అఖిల్ పెళ్లి కూడా నాగ‌చైత‌న్య పెళ్లితో పాటు ఒకే వేదిక పై జ‌రుగుతుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ అది నిజం కాద‌ని ప్రూవ్ అయింది. సో – చై పెళ్లి ఈనెల 4న అన్న‌పూర్ణ స్టూడియోస్ లో వైభ‌వంగా జ‌రిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. అక్కినేని అఖిల్ విదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాడా? లేక ఇంకేదైనానా? అన్న‌దానికి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. నాగార్జున నుంచి తదుప‌రి పెద్ద ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అభిమానులు వేచి చూస్తున్నారు.

బిగ్ బాస్ 8 : ఆ ఇద్దరి మధ్యే టైటిల్ ఫైట్..!

0

బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు వచ్చింది. మరో వారం రోజులు మాత్రమే ఉన్న ఈ సీజన్ లో ప్రస్తుతం హౌస్ లో ఆడియన్స్ కు డైరెక్ట్ గా ఓటింగ్ అప్పీల్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. ఐతే అది వారికిచ్చిన టాస్క్ గెలిస్తేనే ఆ ఛాన్స్ వస్తుంది. ఈ టాస్క్ తో పాటుగా హౌస్ లోకి కొంతమందిని పంపించి వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు. గురువారం ఎపిసోడ్ లో బ్యాండ్ వచ్చి కంటెస్టెంట్స్ ని అలరించారు.
ఇక ఆల్రెడీ ప్రేరణ, నబీల్ ఓటింగ్ అప్పీల్ చేయగా విష్ణు ప్రియ కూడా ఆ ఛాన్స్ దక్కించుకుంది. మరోపక్క ఈ టాస్కుల్లో గౌతం తన బెస్ట్ ఇస్తున్నాడు. అసలే టైటిల్ రేసులో ఉన్న గౌతం ఈ టాస్కుల్లో ఇస్తున్న పర్ఫార్మెన్స్ తో దూసుకెళ్తున్నాడు. మరోపక్క టైటిల్ రేసులో ఉన్న నిఖిల్ ఎందుకో కాస్త డల్ అయ్యాడు. నిఖిల్ టాస్కుల్లో కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు.

ఓటింగ్ కు ఛాన్స్ ఉన్న ఈ చివరి వారాల్లో నిఖిల్ ఇలా తన ఫోకస్ కోల్పోవడం ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. రోజు రోజుకి గౌతం రైజ్ అవుతుంటే నిఖిల్ గ్రాఫ్ పడిపోతోంది. ఐతే వైల్డ్ కార్డ్ గా వచ్చి గౌతం టైటిల్ విన్నర్ అయితే అది నిజంగానే సంచలనం అవుతుంది. ఐతే నిఖిల్ కి కూడా టైటిల్ గెలిచే ఛాన్స్ 100 శాతం ఉంది. ఈ ఇద్దరిలో ఎవరిది టైటిల్ అవుతుంది అన్నది మరో వారం తర్వాత తెలుస్తుంది.

నిఖిల్ ముందు నుంచి తన దూకుడు ఆటతో మెప్పిస్తూ వచ్చాడు. కాకపోతే అతను సోనియా, సీత, యష్మి ఇలా అమ్మాయిలతో క్లోజ్ గా ఉండి వారి విషయంలో డబుల్ గేమ్ ఆడటం వల్ల అతని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అయినా కూడా నిఖిల్ పడుతూ లేస్తూ అన్నట్టుగా తన బెస్ట్ ఇచ్చేందుకు చూస్తున్నాడు. మరి నిఖిల్ గౌతం లో సీజన్ 8 విజేత ఎవరు అవుతారన్నది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ విన్నర్ మాత్రమే కాదు టాప్ 6కి ఎవరు వెళ్తారన్నది కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ వీక్ నబీల్, రోహిణి, విష్ణు ప్రియలో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోతారని టాక్. సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. మెగా చీఫ్ గెస్ట్ అతిథిగా కూడా రాబోతున్నారని తెలుస్తుంది.

JD Vance’s Thanksgiving with Indian In-Laws Goes Viral!

0

In the grand tapestry of family gatherings, JD Vance’s recent Thanksgiving celebration with his Indian in-laws could easily be likened to a vibrant festival, bursting with color and warmth. The image, which has gone viral, captures a moment of unity that transcends cultural boundaries. Vance, clad in a casual blue T-shirt and jeans, holds his son aloft on his shoulders, surrounded by a joyful assembly of approximately 21 family members. This backyard scene, reminiscent of a bustling Indian wedding, was shared by venture capitalist Asha Jadeja Motwani, who aptly remarked that it “reminds me of a big fat Indian wedding” 147.

The photograph has sparked a wave of admiration across social media platforms, with many users praising Vance for his genuine embrace of his wife Usha’s Indian heritage. Comments flowed in support of the Vice President-elect’s familial bonds, highlighting how he navigates the complexities of blending cultures. One user noted the significance of Vance spending time with Usha’s family, especially considering the challenges outsiders may face when adapting to Indian traditions. Another added humorously that Vance’s son sitting on his shoulder was “in a pure Indian way,” capturing the essence of familial affection typical in Indian households 235.

As the image circulated widely, it also served as a counter-narrative to previous criticisms aimed at Vance regarding cultural insensitivity. Many users defended him against accusations of racism, asserting that this heartwarming depiction showcases his commitment to family and respect for diverse traditions. This moment not only highlights Vance’s personal life but also reflects a broader narrative about acceptance and love within multicultural families 468.

In closing, one might say that if Thanksgiving is about gratitude and togetherness, then JD Vance’s celebration was a masterclass in both—complete with all the trimmings. Perhaps we should all take notes from this gathering; after all, who wouldn’t want to turn their family get-togethers into a scene worthy of a Bollywood blockbuster?

ఎప్పటికీ ప్రేమిస్తాను అంటూ.. సమంత ఎమోషనల్ పోస్ట్

0

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్‌లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులోనూ నాగచైతన్య వివాహం సమయంలో ఆమె సోషల్ మీడియాలో ఎలా స్పందించినా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆమె మరో ఆసక్తికరమైన పోస్ట్ చేయడం కూడా ట్రెండ్ అవుతోంది.

ఇటీవల తన వదిన నికోల్‌ జోసఫ్‌ పెట్టిన పోస్ట్‌ను సమంత షేర్ చేశారు. “ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉంటారు. మా వదినను ఎప్పటికీ ప్రేమిస్తాను” అనే నికోల్ మాటల్ని షేర్ చేసిన సమంత “లవ్ యూ” అంటూ స్పందించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన సోదరుడు డేవిడ్ వివాహ వేడుకలో సమంత పాల్గొని ఎంతో సంతోషంగా కనిపించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్మైలీ ఫొటోలతోపాటు, స్ఫూర్తిమంతమైన పోస్టులు షేర్ చేయడం సమంతకు కొత్తేం కాదు. తాజాగా, “సిటడెల్: హనీ బన్నీ” టీమ్‌తో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. “ఇంత గొప్ప టీమ్‌తో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప గౌరవం,” అంటూ రాజ్ అండ్ డీకేతో పని చేయడం తనకు ప్రేరణనిచ్చిందని తెలిపారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం అవుతోంది.

అలాగే సమంత మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన కుస్తీ పోటీలో అబ్బాయిని ఓడించిన అమ్మాయి వీడియోను షేర్ చేస్తూ “ఈ అమ్మాయిలాగా పోరాడండి” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో అభిమానుల మధ్య వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా సమంత పోరాటభావం, ఆత్మవిశ్వాసం గురించి అభిమానులు ప్రశంసిస్తున్నారు.

సమంత తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, ఆ సందర్భంలో తండ్రి చెప్పిన ప్రేరణాత్మక మాటలు తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పిన సమంత, నటిగా రాణించిన తర్వాత తల్లిదండ్రులు తనపై గర్వించారని గుర్తుచేశారు. ఈ విషాదం మధ్య తన ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సమంత వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. “సిటడెల్: హనీ బన్నీ” రిలీజ్ కాగా, “మా ఇంటి బంగారం” సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అలాగే, “రక్త్ బ్రహ్మాండ” అనే మరో వెబ్‌సిరీస్‌పై కూడా ఆమె పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు సమంత కెరీర్‌కు మరింత బూస్ట్ ఇవ్వనున్నాయి.

బన్నీ తపస్సు.. ‘పుష్ప 2’కి త్రివిక్రమ్‌ రివ్యూ

0

ఏడాది కాలంగా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తున్న పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప పార్ట్‌ 1 కి అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అరుదైన రికార్డ్‌ను అల్లు అర్జున్‌ సొంతం చేసుకోవడంతో పుష్ప 2 ఇంకా ఆయన పాత్ర ఎలా ఉంటుంది, సుకుమార్‌ చేసిన మ్యాజిక్‌ ఏంటా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

పుష్ప 2 అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది అంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్‌ నటనతో మరోసారి పుష్ప 2 సినిమా స్థాయిని పెంచారని ఫ్యాన్స్‌ తో పాటు ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పుష్ప 2 సినిమా గురించి స్పందించారు. సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పుష్ప 2 సినిమాపై త్రివిక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు మరింత పెంచే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

త్రివిక్రమ్‌ సోషల్‌ మీడియా వేదికగా… సినిమాలో ఫహద్‌ పాజిల్‌, రష్మికల నటన చాలా బాగుంది. దేవి శ్రీ ప్రసాద్‌ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా అల్లు అర్జున్‌ అద్భుతంగా నటించారు. పుష్ప పాత్రలో ఆయన నటించిన తీరును ప్రేక్షకులు అంత ఈజీగా మరచిపోలేరు. బన్నీ సృష్టించిన అద్భుతం నుంచి ప్రేక్షకులు అంత తొందరగా బయట పడటం సాధ్యం కాదు. ఈ సినిమాలో ఆయన నటించలేదు, సినిమా కోసం తపస్సు చేసినట్లు అనిపించింది. ఇది బ్లాక్‌ బస్టర్‌ మూవీ అంటూ పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్‌ చేయబోతున్న సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది. గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్‌ కథను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఆ మధ్య బన్నీ వాసు మాట్లాడుతూ బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా మామూలుగా ఉండదని, భారీ పీరియాడిక్ మూవీగా ఉంటుందని, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున వసూళ్లు సాధించే విధంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. కనుక వీరి కాంబో మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025 లో సినిమా ప్రారంభం అయ్యి 2026 కి ప్రేక్షకుల ముందుకు వీరు వస్తారేమో చూడాలి.

పుష్ప 2: RGV మెగా రివ్యూ.. ఏమన్నారంటే.. h

0

ఐకాన్ స్టార్ అల్లు ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోలకి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ప్రస్తుతం ట్విట్టర్ లో ‘పుష్ప 2’ నామజపం నడుస్తోంది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్ సన్నివేశాలు. జాతరలో అమ్మవారి గెటప్ లో బన్నీ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నాయని అంటున్నారు. కొన్ని థియేటర్స్ లో ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమా అసలైన రిజల్ట్ ఏంటనేది ఈ రోజు పడే షోలతో ఆల్ మోస్ట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఓ వైపు ట్విట్టర్ లో పబ్లిక్ టాక్, మరో వైపు రివ్యూయర్స్ సోషల్ మీడియాలో తన ఒపీనియన్స్ ని షేర్ చేసుకున్నారు. చాలా రివ్యూలలో సినిమాలోని అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా నిడివి కొద్దిగా ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘పుష్ప 2’ పైన ట్విట్టర్ లో రివ్యూ షేర్ చేసుకున్నారు. ‘పుష్ప 2’ తో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టీమ్ కి అభినందనలు తెలియజేశాడు. అల్లు అర్జున్ ఇప్పుడు మెగా మెగా మెగా మెగా అంటూ ఆర్జీవీ తన ట్వీట్ లో రాశారు. ఈ మూవీ రిలీజ్ కి రెండు రోజుల ముందు నుంచి ఆర్జీవీ ట్విట్టర్ లో మెగా ఫ్యాన్స్ ని, మెగా హీరోలని ప్రోవోక్ చేసే విధంగా ట్వీట్ లు చేస్తున్నారు.

వీటికి కొనసాగింపుగా ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అని తన అభిప్రాయాన్ని చెప్పడమే కాకుండా అల్లు మెగా హీరో అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మెజారిటీగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మేకర్స్ ఏ టార్గెట్ తో ప్రీమియర్స్ వేసారో ఆ పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకి బలంగా వస్తోంది.

అది ఈ రోజు కలెక్షన్స్ లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 200+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సునాయాసంగా అందుకుంటుందని అనుకుంటున్నారు. టికెట్ ధరలు కూడా పెంచిన నేపథ్యంలో ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Pushpa 2 : The Rule – Movie Review

0

Cast – Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Rao Ramesh, Sunil, Anasuya, Ajay, Ajay Ghosh, Jagapathi Babu and others
Director – Sukumar
Producer – Naveen Yerneni, Ravi Shankar
Banner – Mythri Movie Makers & Sukumar Writings
Music – Devi Sri Prasad

Pushpa 2: A Cinematic Extravaganza
The sequel to the blockbuster Pushpa has generated immense excitement, building on the pan-Indian success of its predecessor. With Allu Arjun leading an aggressive promotional campaign, trade analysts predict the film will set new benchmarks at the box office.

Storyline:
The narrative follows Pushpa Raj (Allu Arjun), now settled in a happy married life, as he embarks on an ambitious mission to help his friend Siddappa (Rao Ramesh) become the Chief Minister. This involves raising ₹500 crore through the smuggling of red sanders. However, challenges arise when SP Shekawat (Fahadh Faasil), still seeking revenge for past grievances, complicates Pushpa’s plans. Amidst these struggles, a domestic crisis adds further depth and complexity to Pushpa’s journey.

Performances:
Allu Arjun once again delivers a masterclass in acting, surpassing his National Award-winning performance from the first installment. The Gangamma Jathara sequence and the climactic scenes showcase his unmatched versatility, with one standout moment involving him portraying a female persona. His ability to blend intense action with emotional gravitas makes this film undeniably his showcase.

Rashmika Mandanna, despite limited screen time, leaves a lasting impact with her emotive presence, particularly excelling in key emotional scenes and the visually stunning “Peelings” song.

With heightened drama, dynamic performances, and engaging storytelling, Pushpa 2 promises to exceed expectations, solidifying its place as one of the most anticipated films of the year.
Performances:
Fahadh Faasil once again delivers an exceptional performance, elevating the film’s tension with his commanding screen presence and authentic portrayal of the antagonist. Rao Ramesh impresses with his role, while Jagapathi Babu’s character lacks depth, leaving a less impactful impression.

Sunil and Anasuya Bharadwaj reprise their roles from the first part but have limited significance in the storyline. Sreeleela’s item number, unfortunately, emerges as the weakest segment of the film.

Technical Excellence:
Mirosław Kuba Brożek’s cinematography is a standout, offering visually stunning sequences that surpass the first installment. The film benefits from a significantly increased budget, which has enhanced its production quality, including top-notch VFX, sleek visuals, and meticulously executed action scenes.

The dialogues are sharp, and the production design elevates the overall cinematic experience. While Devi Sri Prasad’s music doesn’t quite match the iconic tunes of the first film, it remains effective, complemented by Sam CS’s solid background score. However, the editing emerges as a noticeable weakness, slightly detracting from the film’s impact.

Overall, Pushpa 2 thrives on its stellar performances and impressive technical advancements, further raising the bar for the franchise.

Positives:

Allu Arjun’s career-defining performance.
The 20-minute Jathara episode – a cinematic masterpiece.
Riveting interval sequence.
Four outstanding songs seamlessly integrated into the narrative.
Sukumar’s writing and direction striking a perfect balance between mass appeal and thoughtful storytelling.
Fahadh Faasil’s engaging and entertaining performance.
Rashmika Mandanna’s emotionally charged outburst during the Jathara sequence.

Negatives:

Lack of a compelling antagonist to challenge the protagonist.
Pacing issues due to editing, particularly in the second half.
Occasional sound sync issues in a few sequences.

Analysis:
Director Sukumar proves his versatility once again by stepping outside his comfort zone to create a commercial mass entertainer with depth. Following the success of Rangasthalam and Pushpa: The Rise, Sukumar refines his approach, delivering a spectacular sequel that combines his signature intelligent storytelling with adrenaline-pumping commercial elements.

The first half of Pushpa 2 sets the stage brilliantly, with subtle character elevations and a thrilling pre-interval sequence. Despite a minor dip in pace, the narrative stays engaging, leading to a high-impact interval block.

The second half is where Sukumar truly shines. The Jathara episode, a 20-minute spectacle, stands out as a cinematic triumph. Allu Arjun’s performance in this sequence is nothing short of phenomenal, reaffirming his position as a powerhouse of talent. Sukumar’s ability to weave songs like Peelings and Kissik into the storyline showcases his genius in blending music with narration.

The emotional core of the film lies in the beautifully written sequences between Pushpa (Allu Arjun) and Srivalli (Rashmika Mandanna). Their relationship is portrayed with depth, showcasing mutual love, respect, and unwavering support. Ajay’s emotional breakdown during the climax, accompanied by thought-provoking dialogues about the role of a wife and the importance of respecting women, adds a powerful and relatable dimension to the film.

While the film excels in many areas, the lack of a formidable antagonist is a noticeable drawback. With multiple villains in the narrative, none pose a significant challenge to Pushpa Raj, which slightly reduces the stakes. Additionally, tighter editing in the second half could have enhanced the overall pacing.

Conclusion:
Pushpa 2: The Rule is a cinematic spectacle that overshadows its minor flaws with its strong performances, exceptional direction, and thrilling storytelling. Allu Arjun delivers the performance of his lifetime, while Sukumar’s innovative narrative approach elevates the film to new heights.

A perfect blend of mass entertainment and masterful filmmaking, Pushpa 2 is a must-watch that guarantees a packed theatre experience.

వస్తున్నా… ఇక జనంలోకి జగన్ | YS Jagan District Tours | YSRCP

0

వస్తున్నా… ఇక జనంలోకి జగన్ | YS Jagan District Tours | YSRCP

Earthquake : ములుగులో ఏం జరుగుతోంది? | నాడు టోర్నడో, నేడు భూకంపం | Earth Quake

0

Earthquake : ములుగులో ఏం జరుగుతోంది? | నాడు టోర్నడో, నేడు భూకంపం | Earth Quake

PROMO: Daawath with Movie Team Hari Katha | Arjun | Poojitha | S2 Ep 16| Ariyana

0

PROMO: Daawath with Movie Team Hari Katha | Arjun | Poojitha | S2 Ep 16| Ariyana

పుష్ప 2.. సెవెన్ స్టార్ హోటల్ లో ఇడ్లీ లాంటిది : RGV

0

పుష్ప 2.. సెవెన్ స్టార్ హోటల్ లో ఇడ్లీ లాంటిది : RGV

Ravi Teja & Trivikram Meet Up; What’s Cooking

0

Mass Maharaja Ravi Teja is currently busy shooting for his next film. Meanwhile, he is spotted with director Trivikram Srinivas the other day. Music director Thaman is also seen along with him. The trio is seen working on something but there is no clarity on the same.

It would be interesting to see the three working. Trivikram has not worked with Ravi Teja so far. And the fans eagerly await for a collaboration between them. Trivikram has penned a song for Ravi Teja’s film Oka Raju Oka Rani in the past. Later, they never did a film together.

Trivikram’s last film Guntur Kaaram did not fare well at the box office and he is now planning to work with Ravi Teja. If the reports are true, Trivikram is planning to do a quick film with Ravi Teja but there is no clarity on the same.

Thaman is the music director of the film Kick, starring Ravi Teja. It is Thaman’s debut film. Later, he went on to be a successful composer. It will be nice if the three of them collaborate.

మా నందు Birthday Party అంటే Minimum ఇట్టా ఉండాలా || Madam Anthe |

0

మా నందు Birthday Party అంటే Minimum ఇట్టా ఉండాలా || Madam Anthe |

Advertisement
Advertisement
Advertisement